ఈ విశాల విశ్వంలో మనమొక్కరమే ఉన్నామా? అనంతవిశ్వం లో భూమిపై నివసిస్తున్న ప్రాణులకి తోడుగా ఇంకెవరైనా ఉన్నారా? మనుషులకి తోడుగా ఇతర గ్రహాలపై జీవులు ఉన్నారా? గ్రహాంతర వాసుల పరిస్థితి ఏంటి? గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటె భూమిపైకి వాచిపోతుంటారా? గ్రహాంతరవాసుల కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు ఏంటి?

ఈ విశాల విశ్వంలో మనమొక్కరమే ఉన్నామా? అనంతవిశ్వం లో భూమిపై నివసిస్తున్న ప్రాణులకి తోడుగా ఇంకెవరైనా ఉన్నారా? మనుషులకి తోడుగా ఇతర గ్రహాలపై జీవులు ఉన్నారా? గ్రహాంతర వాసుల పరిస్థితి ఏంటి? గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటె భూమిపైకి వాచిపోతుంటారా? గ్రహాంతరవాసుల కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు ఏంటి? ప్రస్తుతానికి ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. అయితే అప్పుడప్పుడు కొన్ని చోట్ల గ్రహాంతరవాసులు కనిపించారనే వార్తలు వింటుంటాం. దింట్లో నిజమెంతో ఇప్పటికీ నిద్ధారణ కాలేదు. అయితే తాజాగా గ్రహాంతరవాసులు ఒక గ్రామం పై దాడి చేసాయన్న వార్త మాత్రం వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

పెరూ దేశంలోని పెరువియన్(Peruvian) గ్రామంపై గ్రహాంతరవాసుల దాడులు చేసారని స్థానికులు చెప్తున్నారు. తమ గ్రామంలో 7 అడుగుల గ్రహాంతరవాసులు కనిపించారని కొందరు స్థానికులు అంటున్నారు. అందులో ఒక గ్రహాంతర వాసి తమ గ్రామంపై దాడి చేయడమే కాకుండా ఓ మహిళ ముఖాన్ని తినేశాడని గ్రామస్తులు అంటున్నారు. ఎగురుతూ వచ్చిన 7 అడుగుల ఏలియన్, యువతి ముఖం తినేసాడని ఫొటో కూడా చూపిస్తున్నారు స్థానికులు. గ్రహాంతరవాసి గురించి చెబుతూ సుమారు 7 అడుగుల పొడవు, పొడవాటి తల, కళ్లు సగం పసుపు రంగులో ఉన్నాయని గ్రామస్తులు చెప్తున్నారు.

పెరువియన్ గ్రామంలోని కొంతమంది గ్రామస్తులు 7 అడుగుల ఎగిరే గ్రహాంతరవాసులు గ్రామాన్ని ఆక్రమించారని చెప్తున్నారు. అనంతరం ఓ మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి ఆమె ముఖాన్ని తినేశారని వారంటున్నారు. గ్రహాంతరవాసిని తన మొబైల్ తో ఫోటో కూడా తీసినట్లు ఒక మహిళ పేర్కొంది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ కూడా అవుతోంది. అయితే అక్కడి స్థానిక అధికారులు మాత్రం గ్రహాంతరవాసుల వార్తని కొట్టిపారేస్తున్నారు. ఎలియెన్స్ అంటూ ప్రచారం చేస్తున్న 'పెలకరా’ గ్రామస్తులు దక్షిణ అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అక్రమ బంగారు మైనింగ్ సిండికేట్ సభ్యులుగా అనుమానిస్తున్నారు అక్కడి అధికారులు.

తాము చూసినట్లుగా భావిస్తున్న గ్రహాంతరవాసుల గురించి ఇకితు అనే గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. వారి తల పెద్దగా ఉందని, శరీరం రంగు వెండిలా ఉందని, గ్రహాంతరవాసులు నలుపు రంగు హుడ్స్ ధరించినట్లు తెలిపారు. మన ఆయుధాలు గ్రహాంతరవాసులపై ఎలాంటి ప్రభావం చూపలేదని వారు చెప్పడం గమనార్హం. ఆగస్టు 11న గ్రహాంతరవాసుల దాడి జరిగిందని, ఇకితు గ్రామ ప్రజలు చెప్తున్నారు. తాము నిజం చెప్తుంటే స్థానిక అధికారులు నమ్మకపోగా గ్రామస్తులనే అనుమానిస్తున్నారని వారు వాపోతున్నారు. ఫోటో సాక్ష్యం చూపించినా నమ్మడంలేదని, మరో పక్క ఎలియెన్స్ దాడి విషయం తమ గ్రామంతో పాటు ఇతర గ్రామాలకి చేరడంతో అందరూ భయంతో ఉన్నారని, భయం తీర్చాల్సిన అధికారులు మొరటుగా ప్రవర్తించడం దారుణంగా ఉందంటూ వాపోతున్నారు.

అయితే పెరూవియన్ గ్రామంపై దాడి చేసింది దశాబ్దాలుగా లాటిన్ అమెరికా(America)ను నియంత్రించిన ఎఫ్ఏఆర్‭సీ వంటి డ్రగ్ కార్టెల్స్‌తో సంబంధాలు ఉన్న బంగారం మాఫియాకి చెందినవారని పోలీస్ అధికారులు చెప్తున్నారు. మాఫియా సభ్యులు ధరించిన మాస్కులు, హూడిలు చూసి గ్రహాంతరవాసులుగా గ్రామస్తులు భావిస్తున్నారని పోలీసులు అంటున్నారు. స్థానికులని ఏమార్చడానికి మాఫియా పన్నిన పన్నాగంగా వారు చెప్తున్నారు.

Updated On 18 Aug 2023 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story