Amusement Park Accident: పార్కులో ప్రమాదం.. బాధితుడి కుటుంబానికి రూ.2,624 కోట్ల పరిహారం..!
అమెరికాలోని ఓ పార్కులో ప్రమాదవశాత్తు మరణించిన యువకుడి కుటుంబానికి రూ.2,624 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఫ్లోరిడా కోర్టు(Florida Court)తీర్పునిచ్చింది.

అమెరికాలోని ఓ పార్కులో ప్రమాదవశాత్తు మరణించిన యువకుడి కుటుంబానికి రూ.2,624 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఫ్లోరిడా కోర్టు(Florida Court)తీర్పునిచ్చింది. ఫ్లోరిడా జ్యూరీ 2022లో మరణించిన యువకుడి కుటుంబానికి మిలియన్ల డాలర్లు చెల్లించాలని అమ్యూజ్‌మెంట్ పార్క్(Amusement Park ) రైడ్ వెనుక ఉన్న కంపెనీని ఆదేశించింది. ఆరెంజ్ కౌంటీలోని ఫ్లోరిడా జ్యూరీ, ఫ్రీ ఫాల్ డ్రాప్ టవర్ రైడ్ వెనుక ఉన్న ఫన్‌టైమ్ హ్యాండెల్స్ 14 ఏళ్ల శాంప్సన్ మృతికి కారణమైందని కంపెనీకి కోర్టు ఆదేశించింది. బాధితుడి కుటుంబానికి $310 మిలియన్ల (రూ.2,624 కోట్ల) నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించింది. 2022లో ఓర్లాండ్‌లోని ఐకాన్ పార్క్‌లో టైర్ శాంప్సన్ 70 అడుగుల ఎత్తు నుంచి జారిపడి మరణించాడు. దీనిపై ఆ బాలుడి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
