అమెరికాను మరోసారి భారీ మంచు తుపాన్ కమ్మేసింది. ఇప్పటికే గత వారం రోజుల నుంచి కాలిఫోర్నియాను ఈ తుఫాన్ వణికిస్తోంది. టెక్సాస్ , లూసియానా లను తుఫాన్ తాకడంతో కాలిఫోర్నియాలో భారీగా మంచు కురుస్తోంది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వేలాది మంది చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. డాలస్ కు టోర్నడో తాకే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశారు . మరోవైపు టెక్సాస్ లో 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని జాతీయ […]

అమెరికాను మరోసారి భారీ మంచు తుపాన్ కమ్మేసింది. ఇప్పటికే గత వారం రోజుల నుంచి కాలిఫోర్నియాను ఈ తుఫాన్ వణికిస్తోంది. టెక్సాస్ , లూసియానా లను తుఫాన్ తాకడంతో కాలిఫోర్నియాలో భారీగా మంచు కురుస్తోంది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వేలాది మంది చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. డాలస్ కు టోర్నడో తాకే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశారు . మరోవైపు టెక్సాస్ లో 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని జాతీయ వాతావరణ సేవల సంస్థ తెలిపింది.

డాలస్ సమీపంలో తీవ్రమైన గాలులు వీచాయని పేర్కొంది. ఉత్తర డాలస్ ప్రాంతంలో కొన్ని చెట్లు కూలిపోగా ... మరికొన్ని చోట్ల వాహనాలు బోర్లా పడ్డాయి . డాలస్ లోని పోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానశ్రయంలో దాదాపు 400 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. మరోవైపు టెక్సాస్ లో 3,46,000 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ తుఫాన్ కారణంగా కాలిఫోర్నియా లో 7 అడుగుల మేర హిమాపాతం సంభవించింది. కాలిఫోర్నియా లో కొన్నాళ్ల నుంచి నెలకొన్న కరువు పరిస్థితులు ఈ తుపాన్ తో కొంత తగ్గే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Updated On 6 April 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story