Solar Eclipse : సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం... అగ్రరాజ్యం ప్రత్యేక జాగ్రత్తలు!
ఈ నెల 8వ తేదీన ఖగోళంలో అద్భుతం చోటు చేసుకోబోతున్నది. ఆ రోజున కాసేపు సూర్యుడు కనిపించడు. సంపూర్ణ సూర్యగ్రహణం(Solar eclipse) సంభవించబోతున్నది. పట్టపగలే దట్టమైన చీకట్లు అలుముకోబోతున్నాయి. భారత కాలమాన ప్రకారం ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 9.12 గంటలకు ప్రారంభమయ్యే ఈ సూర్యగ్రహణం తెల్లవారుజామున 1.25 గంటలకు ముగుస్తుంది.
ఈ నెల 8వ తేదీన ఖగోళంలో అద్భుతం చోటు చేసుకోబోతున్నది. ఆ రోజున కాసేపు సూర్యుడు కనిపించడు. సంపూర్ణ సూర్యగ్రహణం(Solar eclipse) సంభవించబోతున్నది. పట్టపగలే దట్టమైన చీకట్లు అలుముకోబోతున్నాయి. భారత కాలమాన ప్రకారం ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 9.12 గంటలకు ప్రారంభమయ్యే ఈ సూర్యగ్రహణం తెల్లవారుజామున 1.25 గంటలకు ముగుస్తుంది. అమెరికా కాలమాన ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభం కానుంది. సంపూర్ణ సూర్యగ్రహణం కావడంతో అమెరికాలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ రోజున అమెరికాలోని పలు రాష్ట్రాలలో పాఠశాలలు మూసివేయనున్నారు. సూర్యడి నుంచి వెలువడే హానికరమైన కిరణాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు. 2024 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. హిందూ మతం, జ్యోతిష శాస్త్రంలో సూర్య గ్రహణానికి సంబంధించిన అనేక నమ్మకాలు ఉన్నాయి. అయితే సైన్స్ మాత్రం దీనిని ఖగోళంలో జరిగే సాధారణ సంఘటన గా భావిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సూర్య గ్రహణం మొత్తం 4 గంటల 25 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ సూర్య గ్రహణం భారత(India) దేశంలో కనిపించనప్పటికీ అమెరికాలో స్పష్టంగా చూడవచ్చు..