ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తొలి బ్యాచ్ ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి చేరుకుంది. మొదటి బ్యాచ్‌లో మహిళలు, వృద్ధులు, పిల్లలు సహా మొత్తం 212 మంది భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీ చేరుకోగానే భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఇజ్రాయెల్‌(Israel)లో చిక్కుకుపోయిన భారతీయుల తొలి బ్యాచ్ ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ(New Delhi)కి చేరుకుంది. మొదటి బ్యాచ్‌లో మహిళలు, వృద్ధులు, పిల్లలు సహా మొత్తం 212 మంది భారత్‌(India)కు చేరుకున్నారు. ఢిల్లీ చేరుకోగానే భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు మన దేశంలో ఉన్నామని.. చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది, ఆ తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన 2500 మంది చనిపోయారు. కాగా, ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను భారత్‌కు తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌(Operation Ajay)ను ప్రారంభించింది.

ఇజ్రాయెల్ నుండి భారతదేశానికి బ‌య‌ల్దేరే ముందు.. ఓ భారతీయ విద్యార్థి మాట్లాడుతూ.. నేను భారతదేశానికి వెళ్తున్నాను.. నేను చాలా సంతోషంగా ఉన్నా.. ఇక్కడ అంతా చాలా భయానకంగా మారింది. మేము ఇంటికి వెళ్ళబోతున్నాము. మమ్మల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు అని పేర్కొన్నాడు.

ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి కార్యాలయం అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు సహాయం చేస్తోందని ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి సంజీవ్ సింగ్లా తెలిపారు. మొదటి బ్యాచ్ భారతీయ ప్రయాణికులు గురువారం టెల్ అవీవ్ నుండి భారతదేశానికి బయలుదేరారు. తొలి బ్యాచ్‌లో 212 మంది ఉన్నారు. భారత్ వెళ్లాలనుకునే వారికి భారత రాయబార కార్యాలయం సహాయం చేస్తుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. భారతీయ పౌరుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఘర్షణల దృష్ట్యా ఒకరోజు ముందుగానే 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

జెరూసలేంలోని అల్-అక్సా మసీదును ఇజ్రాయెల్ అపవిత్రం చేసినందుకు ఇది ప్రతీకారం అని హమాస్ పేర్కొంది. ఏప్రిల్ 2023లో అల్-అక్సా మసీదుపై గ్రెనేడ్ విసిరి ఇజ్రాయెల్ పోలీసులు అపవిత్రం చేశారని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ స్థానాలపై నిరంతరం దాడి చేసి ఆక్రమిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం మహిళలపై దాడి చేస్తోంది. ఇజ్రాయెల్‌తో తమ సంబంధాలన్నింటినీ తెంచుకోవాలని అరబ్ దేశాలకు హమాస్ ప్రతినిధి ఘాజీ హమద్ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్ ఎప్పుడూ మంచి పొరుగు దేశంగా, శాంతియుత దేశంగా ఉండదని హమద్ అన్నారు.

Updated On 12 Oct 2023 8:11 PM GMT
Yagnik

Yagnik

Next Story