ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా చాలెంజ్‌లు(Social media challa) ప్రాణాలపైకి వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా చాలెంజ్‌లు(Social media challa) ప్రాణాలపైకి వస్తున్నాయి. సెలబ్రెటీల నుంచి సామాన్యల వరకు ఒకరిని చూసి మరొకరు సోషల్‌ మీడియాలో రీల్స్, సాహసాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్(Influencer) జలపాతం దగ్గర రీల్(reel) చేస్తూ లోయలో పడి మృతి చెందింది. మరోవైపు సోషల్‌ మీడియాలో చాలెంజ్‌లు విసురుకోవాడం, వాటిని స్వీకరించి సాహసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చూశాం. కొన్ని ఫుడ్‌ చాలెంజ్‌లు కూడా చూస్తున్నాం. ఫిట్‌నెస్‌ పరంగానూ ఆరోగ్యపరంగానూ మంచివి అయితే ఎలాంటి సమస్య ఉండదు. కొన్ని ప్రమాదకర స్టంట్‌లే లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాయి. తాజాగా ఇన్‌ఫ్లూయెన్సర్ ఫుడ్‌ చాలెంజ్‌ను తీసుకొని ప్రాణాలు పోగుట్టుకుంది.

చైనాలో(china) ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఆన్‌లైన్‌ చాలెంజ్‌లు తీసుకోవడం హాబీ. అలాంటి చాలెంజ్‌లు ఎన్నో తీసుకొని పలు సాహసాలు కూడా చేసింది. అయితే ఈ మధ్యనే ఆమె ఈటింగ్ చాలెంజ్‌ను(Eating challange) కూడా తీసుకుంది. లైవ్‌లో ఈ ఈటింగ్ చాలెంజ్‌ను లైవ్‌లో చేస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఈ చాలెంజ్‌లో 10 గంటల్లో 10 కిలోలకు పైగా ఆహారం తినేందుకు ఆమె సిద్ధపడింది. ఇది చాలా రిస్క్‌తో కూడిన చాలెంజ్‌ అంటూ స్నేహితులు, తల్లిదండ్రులు హెచ్చరించినా ఆమె వినలేదు. ఈ హెవీ ఫుడ్‌ తినడంతో జీర్ణం కాక, పొట్టలో పేరుకుపోయి ఆమె మృతిచెందింది. పోస్టుమార్టం నివేదికలో కూడా జీర్ణం కాని ఆహారం పేరుకుపోవడంతోనే ఆమె మృతిచెందిందని తేలింది.

అయితే దీనిపై వైద్యులు స్పందించారు. కొందరు రుచికరమైన ఆహారం ఉంటే అమితంగా లాగేస్తారని, వారి బ్రెయిన్‌ కూడా నచ్చిన ఆహారం చూసి మరింత తినాలని ప్రేరేపిస్తుందట. దీంతో అదుపులేకుండా ఆహారం తింటారని, ఇది వెంటనే ప్రభావం చూపకపోయినప్పటికీ శరీరంలో మెల్లగా ప్రభావం చూపుతుందని, ఇలాంటి బిగ్‌ చాలెంజీలు తీసుకోవడంతో ఒకేసారి ప్రభావం పడి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. అతిగా ఆహారం తీసుకుంటే పొట్టలో గ్యాస్ట్రిక్‌, ఆమ్లత్వం, కడుపునొప్పి, ఉబ్బరం, గుండెల్లో మంట వంటివి ఎదురవుతాయని సూచించారు. అంతేగా ఫుడ్‌ ఛాలెంజ్‌ల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story