టర్కీలో పరిస్థితి ఇంకా కుదుటపదలేదు... అక్కడి ప్రజలు కోలుకోక ముందే అప్పుడే మరో రెండు భూకంపాలు వచ్చి పడ్డాయి.. మరో వైపు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉండగా.... అటు కాశ్మీర్‌లో భూమి కుంగిపోతూనే ఉంది. రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత 6.4, 5.8గా నమోదైంది. 6.4 అనేది భారీ భూకంపమే అనుకోవచ్చు. ఈ రెండు భూకంపాల ధాటికి మరికొన్ని ఇళ్లు నేలమట్టం అయ్యాయి. 8 మంది గాయపడినట్లు తెలిసింది . అయితే . టర్కీకి దక్షిణాన ఉన్న […]

టర్కీలో పరిస్థితి ఇంకా కుదుటపదలేదు... అక్కడి ప్రజలు కోలుకోక ముందే అప్పుడే మరో రెండు భూకంపాలు వచ్చి పడ్డాయి.. మరో వైపు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉండగా.... అటు కాశ్మీర్‌లో భూమి కుంగిపోతూనే ఉంది. రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత 6.4, 5.8గా నమోదైంది. 6.4 అనేది భారీ భూకంపమే అనుకోవచ్చు. ఈ రెండు భూకంపాల ధాటికి మరికొన్ని ఇళ్లు నేలమట్టం అయ్యాయి. 8 మంది గాయపడినట్లు తెలిసింది . అయితే . టర్కీకి దక్షిణాన ఉన్న హతాయ్ ప్రావిన్స్‌లో ఈ రెండు భూకంపాలూ వచ్చాయి. రెండు వారాల కిందట దాదాపు ఇదే ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది.

టర్కీలోని AFAD ఏజెన్సీ ప్రకారం సోమవారం రాత్రి 8.04కి ఒక భూకంపం రాగా.. రెండోది కొన్ని నిమిషాల తర్వాత వచ్చిందని తెలిసింది. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చేయాలని అధికారులు ఆదేశించారు. టర్నీలో భూకంప మృతుల సంఖ్య 41వేలు దాటింది. ఇప్పటికే బాధలో ఉన్న అక్కడి ప్రజలకు.. తర్వాత వస్తున్న వరుస భూకంపాలు మరింత విషాదంలో ముంచుతున్నాయి. అటు జమ్మూకాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో భూమి కుంగుతూనే ఉంది. రీసెంట్ గా అక్కడి గూల్ ఏరియాలో కొండచరియలు విరిగిపడ్డాయి. కుంగిపోతున్న భూమి వల్ల ఇప్పటికే దాదాపు 15 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలిసింది. దానికి తోడు ఈ కొండ చరియల వల్ల కూడా ఇళ్లకు హాని జరిగింది. అధికారులు ప్రస్తుతం భూమి కుంగుతున్న ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 15 కుటుంబాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Updated On 6 April 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story