FBI : భారతీయ విద్యార్థిని ఆచూకీ చెప్తే 10 వేల డాలర్లు
ఓ భారతీయ విద్యార్థి మయూషి భగత్ (29)( Mayushi bhagat) అమెరికాలో నాలుగేళ్లుగా కనిపించకుండా పోయింది. న్యూజెర్సీలో ఉంటూ 2019 మే 1న ఆమె అదృశ్యమైంది. నాలుగు సంవత్సరాలుగా గాలించినా ఆమె ఆచూకీ దొరకడం లేదు. దీంతో అక్కడి దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ..(FBI) మయూషి భగత్ ఆచూకీ చెప్తే 10 వేల డాలర్ల రివార్డు అందిస్తామని ప్రకటించింది. చివరిసారిగా మయూషిని ఆమె ఆపార్ట్‌మెంట్‌లో 2019 ఏప్రిల్ 29న చూసినట్లు తెలిపారు.
ఓ భారతీయ విద్యార్థి మయూషి భగత్ (29)( Mayushi bhagat) అమెరికాలో నాలుగేళ్లుగా కనిపించకుండా పోయింది. న్యూజెర్సీలో ఉంటూ 2019 మే 1న ఆమె అదృశ్యమైంది. నాలుగు సంవత్సరాలుగా గాలించినా ఆమె ఆచూకీ దొరకడం లేదు. దీంతో అక్కడి దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ..(FBI) మయూషి భగత్ ఆచూకీ చెప్తే 10 వేల డాలర్ల రివార్డు అందిస్తామని ప్రకటించింది.
చివరిసారిగా మయూషిని ఆమె ఆపార్ట్‌మెంట్‌లో 2019 ఏప్రిల్ 29న చూసినట్లు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులకు అంటే మే 1 నుంచి కనిపించడంలేదని పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ కోసం నిర్విరామంగా గాలించినా లభ్యం కాలేదు. దీంతో అదృశ్యమైన వ్యక్తుల జాబితాలో మయూషి భగత్‌ను చేర్చారు. స్టూడెంట్ వీసాతో అమెరికా (America)వెళ్లిన ఆమె.. న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతూ అదృశమైంది. ఈ సందర్భంగా ఆమె వివరాలను వెల్లడించిన పోలీసులు, మయూషి ఎత్తు 5.10 అడుగులు ఉంటుందని.. ఆమె జుట్టు నల్లగా ఉంటుందని.. మూడు భాషలను ఆమె మాట్లాడగలదని పోలీసులు తెలిపారు. న్యూజెర్సీలోని(New Jersey) సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్‌లో మయూషికి ఫ్రెండ్స్ ఉండేవారని తెలిపింది. మయూషీ ఆచూకీ తెలిపినవారికి లేదా ఆమె ఉంటున్న లొకేషన్ తెలిపినవారికి 10 వేల అమెరికా డాలర్లను(Dollars) రివార్డుగా ఇస్తామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ రివార్డ్ విలువ రూ.8 లక్షలకుపై మాటే..!