వియత్నాంలోని(Vietnam) హనోయ్‌ నగరంలో ఉంటున్న ఓ దంపతులు తమ మూడేళ్ల కూతురుతో కొన్నాళ్ల కిందట హో చిన్‌ మిన్హ్‌ సిటీకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

వియత్నాంలోని(Vietnam) హనోయ్‌ నగరంలో ఉంటున్న ఓ దంపతులు తమ మూడేళ్ల కూతురుతో కొన్నాళ్ల కిందట హో చిన్‌ మిన్హ్‌ సిటీకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కూతురు లాన్‌ను అక్కడే స్కూల్‌లో చదవించారు. ఆ చిన్నారి పెరిగి పెద్దదయ్యింది. సౌందర్యరాశి(Bueatiful) అయ్యింది. అందమైన కూతరును చూసి తండ్రికి(Father) ఏదో అనుమానం వచ్చింది. ఆ అనుమానం(Suspicious) ఎందుకంటే భార్యాభర్తలిద్దరూ(Couple) అంత అందమైన వారు కాదు. మరి బిడ్డ అందంగా ఎలా పుట్టిందన్న అనుమానం తండ్రిలో పురుగులా తొలుస్తూ పోయింది. ఇక లాభం లేదనుకుని కూతరు లాన్‌కు డీఎన్‌ఎ(DNA Test) పరీక్ష చేయించాడు. టెస్ట్ రిపోర్ట్ చూసి బిత్తరపోయాడు. లాన్‌ తనకు పుట్టిన కూతురు కాదని డీఎన్‌ఎ పరీక్షలో తేలింది. దాంతో భార్య హాంగ్‌ను, కూతురు లాన్‌ను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. తాగుడుకు బానిసయ్యాడు. హాంగ్‌ కూతరుతో పాటు మళ్లీ హనోయ్‌ నగరానికి వెళ్లింది. అక్కడ కూతురును చదివించసాగింది. ఆ స్కూల్‌లో లాన్‌ పుట్టిన రోజు ఆమె క్లాస్‌లో మరో అమ్మాయి బర్త్‌డే కూడా ఉండింది. అలా లాన్‌ తల్లి హంగ్‌, మరో అమ్మాయి పేరెంట్స్‌ ఒకరినొకరు పరిచయం అయ్యారు. తర్వాత క్లోజ్‌ అయ్యారు. ఇద్దరికి కలిపి ఉమ్మడిగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించసాగారు(Commonbirthday). మాటల్లో లాన్‌ పుట్టిన ఆస్పత్రిలోనే ఆ అమ్మాయి కూడా పుట్టిందనే విషయాన్ని లాన్‌ తల్లి హాంగ్‌ తెలుసుకుంది. దాంతో ఆ అమ్మాయే తన కూతురు కావచ్చనే అనుమానం కలిగింది. ఇదే విషయాన్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా చెప్పింది. అమ్మాయి డీఎన్‌ఏ టెస్ట్‌ చేయిద్దామని వారిని రిక్వెస్ట్ చేసింది. వారు ఒప్పుకోవడంతో ఆ పాపకు డీఎన్‌ఏ టెస్టు చేయించారు. ఆ పరీక్షలో ఆమె హాంగ్‌కు పుట్టిన బిడ్డ అని తేలింది. ఇంతకాలం తన దగ్గర పెరిగిన లాన్‌ తన కూతురు కాదని తెలుసుకుని బాధపడింది. ఇప్పుడు ఎవరి కూతురు వారి దగ్గరే ఉంటున్నారా? లేక పెరిగిన చోటనే ఉంటున్నారా? అన్న విషయంలో క్లారిటీ లేదు. హాంగ్‌ భర్త తన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడా అన్న విషయంలో కూడా స్పష్టత లేదు.

Eha Tv

Eha Tv

Next Story