టర్కీలోని(Turkey) ఓ శివారు గ్రామంలో ఓ కుటుంబం నివసిస్తోంది. చాలా చిత్రమైన ఫ్యామిలీ అది! కుటుంబసభ్యులందరూ పశువుల్లాగే(Animal) నాలుగు కాళ్లతో నడుస్తుంటారు. అంటే రెండు చేతులను రెండు కాళ్లుగా ఉపయగిస్తుంటారు. ఇది తప్ప మిగతా అన్ని విషయాల్లో మనుషుల్లానే ప్రవర్తిస్తారు. అసలు వీరెందుకు నాలుగు కాళ్లతో నడుస్తున్నారన్నది తెలుసుకోవడం కోసం లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌కు(London school Of economics) చెందిన మానసిక శాస్త్రవేత్త(Psychologist) నికోలస్‌ హంఫ్రే(Nicholas Humphrey) అక్కడికి వెళ్లారు

టర్కీలోని(Turkey) ఓ శివారు గ్రామంలో ఓ కుటుంబం నివసిస్తోంది. చాలా చిత్రమైన ఫ్యామిలీ అది! కుటుంబసభ్యులందరూ పశువుల్లాగే(Animal) నాలుగు కాళ్లతో నడుస్తుంటారు. అంటే రెండు చేతులను రెండు కాళ్లుగా ఉపయగిస్తుంటారు. ఇది తప్ప మిగతా అన్ని విషయాల్లో మనుషుల్లానే ప్రవర్తిస్తారు. అసలు వీరెందుకు నాలుగు కాళ్లతో నడుస్తున్నారన్నది తెలుసుకోవడం కోసం లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌కు(London school Of economics) చెందిన మానసిక శాస్త్రవేత్త(Psychologist) నికోలస్‌ హంఫ్రే(Nicholas Humphrey) అక్కడికి వెళ్లారు. ఈ ఫ్యామిలీలోని తల్లిదండ్రులకు మొత్తం 18 మంది సంతానం. ఇందులో ఆరుగురు మాత్రమే జంతువుల మాదిరిగా నడిచేందుకు ఇష్టపడతారు. అనువంశిక సమస్యల కారణంగా వీరు ఈ విధంగా ప్రవర్తిస్తుండవచ్చని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఈ ఆరుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లలో ఇప్పుడు అయిదుగురు మాత్రమే బతికి వున్నారు. వీరంతా 22 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు. వీరి మెదడులో ఓ భాగం కుంచించుకుపోయిందని, దీనిని సెరెబెలర్‌ వర్మిస్‌(Cerebral vermis) అంటారని శాస్త్రవేత్తలు అంటున్నారు. సెరెబెలర్‌ వర్మిస్‌ ఉన్నవారు ఇలాగే రెండు చేతులను కాళ్లలా ఉపయోగించుకోవడానికి ఇష్టపడారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated On 2 Sep 2023 6:14 AM GMT
Ehatv

Ehatv

Next Story