Europe Woman DNA Test : సరదాగా డీఎన్‌ఏ పరీక్షలు .. షాకింగ్ ఫలితాలు
ఒక యూరోపియన్ మహిళ(Europe woman) తన సోదరీమణులతో(Siblings) కలిసి సరదాగా ఇంట్లోనే డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలనుకుంది. అయితే ఆ టెస్ట్ ఫలితాలు తన జీవితంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఆమె గ్రహించలేకపోయింది.
ఒక యూరోపియన్ మహిళ(Europe woman) తన సోదరీమణులతో(Siblings) కలిసి సరదాగా ఇంట్లోనే డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలనుకుంది. అయితే ఆ టెస్ట్ ఫలితాలు తన జీవితంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఆమె గ్రహించలేకపోయింది. తన తల్లిదండ్రులు ఇన్నాళ్లూ ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారని ఆమె ఊహించలేకపోయింది. ఈ మహిళ తన గుర్తింపును వెల్లడించకుండా సోషల్ మీడియా సైట్ రెడ్డిట్‌లో (Reddit)ఒక వివరణాత్మక పోస్ట్ పెట్టింది. దానిలో ఆమె.. ‘నేను, నా సిస్టర్స్ సరదాగా డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలనుకున్నాం. ఒక కిట్ సాయంతో డిఎన్‌ఏ టెస్టు(DNA Test) చేయించుకున్నాం.
ఆ పరీక్ష ఫలితాలు రాగానే గుండె బద్ధలయ్యే నిజం వెలుగు చూసింది. డీఎన్‌ఏ పరీక్ష ఫలితాలలో తన అన్నలు, అక్కాచెల్లెళ్లకు పూర్తి బంధుత్వం ఉందని, తానుమాత్రం ఒంటరినని తేలిందని ఆ మహిళ చెప్పింది. అయితే తల్లిదండ్రులు ఆ డీఎన్‌ఏ ఫలితాలు నిజం కాదని అన్నారు. అయితే ఆమె తండ్రి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని కోరాడు. ఈ విషయంలో తనకేమీ పట్టనట్టు తల్లి వ్యవహరించింది. అయితే ఎట్టకేలకు తండ్రి నిజాన్ని చెప్పాడు.
అయితే ఆమె ఎప్పటికీ తన కుమార్తెనేనని అన్నాడు. ఇంతకాలం తన తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచిపెట్టడంపై ఆ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనను తల్లిదండ్రులు పెంచిన విధానంలో ఏదో తేడా కనిపించడంతో తనకు వేరే తండ్రి ఉన్నాడని అనుకునేదాన్నని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె తల్లితో నాటి పరిస్థితిని చర్చించాలనుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. అయితే తల్లి తనకు ఏమీ తెలియదని అంటోంది. కాగా ఆ మహిళ తన తండ్రి ఎవరో గుర్తించానని. అయితే ఇప్పుడు తాను ఏమి చేయాలంటూ ఆమె రెడ్డిట్ యూజర్స్‌ను కోరింది.