Viral News : నక్కే అతడి దగ్గరకు వచ్చి తోక తొక్కి వెళ్లమంది!
అదృష్టవంతులను చెరిపేవారు లేరంటారు పెద్దలు. నిజమే సుడి ఉండాలే కానీ మనవి కావనుకున్నవి కూడా మన చెంతకు చేరుతుంటాయి. యూరప్(Europe)కు చెందిన ఓ వ్యక్తికి ఎన్ని సుళ్లు ఉన్నాయో తెలియదు కానీ దాదాపు పోయిందనుకున్న డబ్బు అతనికి తిరిగి వచ్చేసింది.

Viral News
అదృష్టవంతులను చెరిపేవారు లేరంటారు పెద్దలు. నిజమే సుడి ఉండాలే కానీ మనవి కావనుకున్నవి కూడా మన చెంతకు చేరుతుంటాయి. యూరప్(Europe)కు చెందిన ఓ వ్యక్తికి ఎన్ని సుళ్లు ఉన్నాయో తెలియదు కానీ దాదాపు పోయిందనుకున్న డబ్బు అతనికి తిరిగి వచ్చేసింది. అసలేం జరిగిదంటే, 11 ఏళ్ల కిందట యూరప్‌కు చెందిన ఓ వ్యక్తి బిట్‌కాయిన్ వాలెట్ పాస్‌వర్డ్(Bitcoin Wallet PassWord) మర్చిపోయాడు. పాస్‌వర్డ్ మర్చిపోవడంతో ఎలాంటి లావాదేవలు చేయలేకపోయాడు.2013లో అతడి వాలెట్‌లో తక్కువ బిట్ కాయిన్‌లు మాత్రమే ఉండేవి. ఆ సమయంలో బిట్‌కాయిన్‌లకు పెద్దగా విలువ లేకపోవడంతో అతడు కూడా లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు బిట్‌కాయిన్ విలువ ఏకంగా 2000 శాతం పెరిగింది. బిట్‌కాయిన్‌ల విలువ బాగా పెరిగిందని తెలుసుకున్న అతడు ఎలాగైనా సరే తన బిట్‌కాయిన్‌లను తిరిగి పొందాలని గట్టిగా డిసైడయ్యాడు. ఇందుకోసం హ్యాకర్లలో కింగ్‌పిన్ అయిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ జో గ్రాండ్(Electrical Engineer Joe Grand)ను సంప్రదించాడు. అతడు అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA అభివృద్ధి చేసిన రివర్స్ ఇంజనీరింగ్ టూల్‌ను ఉపయోగించి పాస్‌వర్డ్ రికవర్ చేసాడు. ఈ పదకొండేళ్లలో బిట్‌కాయిన్ ధర 20,000 శాతానికి పైగా పెరగడంతో, కోల్పోయిన మరుగున పడ్డ బిట్‌కాయిన్ విలువ సంపదగా పెరిగింది. మన కరెన్సీలో చెప్పాలంటే అది సుమారు 25 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో ఆ వ్యక్తి ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యాడు.
