Gabriel Atal : ఫ్రాన్స్ కొత్త ప్రధాని స్వలింగ సంపర్కుడా...?
ఫ్రాన్స్‌కు(France) కొత్తగా ప్రధానమంత్రిగా(Prime Minister) నియమితులైన గాబ్రియేల్ అటల్(Gabriel Atal) ఓ రికార్డు నెలకొల్పారు. యుద్ధానంతర ఫ్రాన్స్‌కు అత్యంత పిన్నవయస్కుడైన ప్రధానమంత్రి ఈయనే! 35 ఏళ్లకే అత్యున్నత పదవిని అధిష్టించారాయన! గాబ్రియల్ అటల్ కంటే ముందు లారెంట్ ఫాబియస్(Laurent Fabius) 37 ఏళ్ల వయసులోనే ప్రధానమంత్రి అయ్యారు. 1984లో ఫ్రాంకోయిస్ మిత్రాండ్(Francois Mitterrand) ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు.
ఫ్రాన్స్‌కు(France) కొత్తగా ప్రధానమంత్రిగా(Prime Minister) నియమితులైన గాబ్రియేల్ అటల్(Gabriel Atal) ఓ రికార్డు నెలకొల్పారు. యుద్ధానంతర ఫ్రాన్స్‌కు అత్యంత పిన్నవయస్కుడైన ప్రధానమంత్రి ఈయనే! 35 ఏళ్లకే అత్యున్నత పదవిని అధిష్టించారాయన! గాబ్రియల్ అటల్ కంటే ముందు లారెంట్ ఫాబియస్(Laurent Fabius) 37 ఏళ్ల వయసులోనే ప్రధానమంత్రి అయ్యారు. 1984లో ఫ్రాంకోయిస్ మిత్రాండ్(Francois Mitterrand) ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు. లేటెస్ట్‌గా ఎలిజబెత్ బోర్న్ స్థానంలో గాబ్రియెల్ నియమితులయ్యారు. తమ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న గాబ్రియేల్‌ను అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధానిగా నియమించారు. తాను స్వలింగ సంపర్కుడినని గాబ్రియేల్ అటల్ బహిరంగంగా చెప్పుకున్నారు. 2018లో మాక్రాన్(Makran) ప్రభుత్వంలో గాబ్రియేల్ అటల్ జూనియర్ మంత్రిగా ఉన్నప్పుడే హాట్ టాపిక్ అయ్యారు.
ఆ సమయంలో మాక్రాన్ మాజీ రాజకీయ సలహాదారు స్టెఫాన్ సెజోర్న్‌తో అటల్ సంబంధం ఏర్పరుచుకున్నారు. గాబ్రియేల్ అటల్ మాజీ క్లాస్‌మేట్ ఈ విషయాన్ని తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో అటల్ ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పనిచేశారు. అప్పటి నుండి ఫ్రెంచ్ రాజకీయాల్లో కీలకనేతగా మారారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు ఆయనకు సలహాదారునిగా వ్యవహరించారు అటల్. అయిదేళ్ల పాటు ఆరోగ్యమంత్రికి కూడా సలహాదారుగా ఉన్నారు. పదేళ్ల కాలంలోనే ఫ్రాన్స్ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1989, మార్చి 16వ తేదీన పారిస్ సమీపంలోని క్లామార్ట్‌లో జన్మించిన అటల్ ట్యునీషియా యూదు న్యాయవాది, సినిమా నిర్మాత అయిన వైబ్స్ అటల్ కుమారుడు. 2015లో వైబ్స్ అటల్ కన్నుమూశారు. తన ముగ్గురు చెల్లెళ్లతో కలిసి పారిస్‌లోనే పెరిగారు అటల్. ఈయన తల్లి మేరీ డి కోర్రిస్ ఒక చిత్ర నిర్మాణ సంస్థలో పనిచేశారు. ఎకోల్ అల్సాసిన్ స్కూల్‌లో చదువుకున్న అటల్ బ్యాచిలర్ డిగ్రీ అయ్యాక సైన్సెస్ పో యూనివర్సిటీలో చేరారు. పబ్లిక్ అఫైర్స్‌లో పీజీ పట్టా పొందారు.