Elon Musk : సరికొత్త సంచలనానికి తెరలేపిన ఎక్స్ (X)
సోషల్ మీడియాలో(Social media) ఇప్పటి ఎక్స్, ఒకప్పటి ట్విట్టర్(Twitter) ఎంత ప్రభావంతమైన ప్లాట్‌ఫాంగా ఉందో మనందరికీ తెలిసిందే. ట్విట్టర్ నుంచి ఎక్స్‌గా మార్చిన తర్వాత మరింత ముందుకు దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే అపర కుబేరుడయిన ఎలన్ మాస్క్(Elon Musk) ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత దాని రూపాన్నే మార్చి పడేశారు.
సోషల్ మీడియాలో(Social media) ఇప్పటి ఎక్స్, ఒకప్పటి ట్విట్టర్(Twitter) ఎంత ప్రభావంతమైన ప్లాట్‌ఫాంగా ఉందో మనందరికీ తెలిసిందే. ట్విట్టర్ నుంచి ఎక్స్‌గా మార్చిన తర్వాత మరింత ముందుకు దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే అపర కుబేరుడయిన ఎలన్ మాస్క్(Elon Musk) ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత దాని రూపాన్నే మార్చి పడేశారు. అయితే తాజాగా మరో సంచలనానికి తెరతీసింది ఎక్స్. ఇప్పటిదాకా కొన్ని నిమిషాల వరకు ఉన్న వీడియోలను మాత్రమే ప్లే చేసే వెసులుబాటు ఉంది. ఇకపై ఎక్స్‌లో పూర్తి నిడివి ఉన్న సినిమాలను(Movie) కూడా చూసే వీలు కల్పిస్తోంది. సినిమాలు, సీరియళ్లను కూడా పోస్ట్ చేసుకోవచ్చని తన ఖాతాదారులకు తెలిపింది. అంతేకాదు వాటిని మానిటైజ్(Monitization) చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చని ఆఫర్ కూడా ఇచ్చారు. పోస్టు చేసిన సినిమాలకు ఒకసారి ఫీజు చెల్లించే విధానాన్ని తీసుకురావాలంటూ ఒక యూజర్ కోరారు. అలా చేస్తే ప్రజలు సబ్ స్కైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కోరుకున్న సినిమాలను కొనుక్కోవచ్చని చెప్తున్నారు. దీంతో ఎక్స్ నిజమైన సినిమా వేదిక అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యూట్యూబ్‌కు పోటీగా వీడియో స్ట్రీమింగ్‌ను అందుబాటులోకి తెస్తోందని విశ్లేషిస్తున్నారు.
అయితే ఇందులో వచ్చే ప్రకటనలను టార్గెటెడ్ యూజర్లకు అందేలా చేయడం కోసం సరికొత్త ఏఐని అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా మస్క్ ప్రకటించారు. ప్రకటన సంస్థలు ఎవరైనా తమ ప్రకటనలు ఎవరికి రీచ్ కావాలో అన్న విషయాన్ని వివరిస్తే తమ అత్యాధునిక ఏఐ వ్యవస్థ సెకన్ల వ్యవధిలో సమాచారాన్ని ఇస్తుందని.. అంతేకాకుండా వారి జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఎక్స్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే మరో సాంకేతిక విప్లవమే వస్తుందంటున్నారు.