సెర్బియాలో ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్ సమీపంలోని పట్టణంలో 21 ఏళ్ల వ్య‌క్తి కాల్పులు జరప‌డంతో ఎనిమిది మంది మ‌ర‌ణించ‌గా.. మరో 10 మంది గాయపడ్డారు. గత రెండు రోజుల్లో సెర్బియాలో కాల్పులు జరగడం ఇది రెండోసారి అని స్థానిక మీడియా పేర్కొంది.

సెర్బియా(Serbia)లో ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్(Belgrade) సమీపంలోని పట్టణంలో 21 ఏళ్ల వ్య‌క్తి కాల్పులు జరప‌డంతో ఎనిమిది మంది మ‌ర‌ణించ‌గా.. మరో 10 మంది గాయపడ్డారు. గత రెండు రోజుల్లో సెర్బియాలో కాల్పులు జరగడం ఇది రెండోసారి అని స్థానిక మీడియా పేర్కొంది. కాల్పుల‌కు పాల్ప‌డిన వ్య‌క్తి ఆటోమేటిక్ వెప‌న్‌(Automatic Weapon)ను ఉపయోగించివుంటాడ‌ని భ‌ద్ర‌తా సిబ్బంది అనుమానిస్తోంది. బెల్‌గ్రేడ్‌కు దక్షిణంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మ్లాడెనోవాక్(Mladenovac) సమీపంలో ఉన్న వ్యక్తులపై దుండ‌గుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు పారిపోయాడు. అత‌డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బుధవారం వ్లాడిస్లావ్ రిబ్నికర్ ప్రాథమిక పాఠశాల(Vladislav Ribnikar primary school)లో 13 ఏళ్ల బాలుడు తన తండ్రి తుపాకీ(Gun)తో స్కూలుకు వెళ్లి కాల్పులు జరపడంతో ఎనిమిది మంది విద్యార్థులు, ఒక గార్డు మరణించారు. కాల్పుల ఘ‌ట‌న‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తుపాకీ నియంత్రణ కోసం ప్ర‌జానీకం పిలుపునిచ్చింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు విద్యార్ధులు, ఒక ఉపాధ్యాయుడు కూడా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స్థానిక మీడియా(Local Media) వెల్ల‌డించింది.

Updated On 4 May 2023 11:37 PM GMT
Yagnik

Yagnik

Next Story