ఇజ్రాయెల్‌(Israel)-హమాస్‌(Hamas) మధ్య జరుగుతున్న భీకర యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇప్పటికే వందలాది మంది చనిపోయారు. గాజా ప్రాంతం భీతావహంగా మారింది. లక్షలాది మందికి నిలువనీడ లేకుండాపోయింది. ఆకలిదప్పులతో అలమటిస్తున్నవారు కూడా లక్షల్లో ఉన్నారు.

ఇజ్రాయెల్‌(Israel)-హమాస్‌(Hamas) మధ్య జరుగుతున్న భీకర యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇప్పటికే వందలాది మంది చనిపోయారు. గాజా ప్రాంతం భీతావహంగా మారింది. లక్షలాది మందికి నిలువనీడ లేకుండాపోయింది. ఆకలిదప్పులతో అలమటిస్తున్నవారు కూడా లక్షల్లో ఉన్నారు. యుద్ధం కారణంగా మూసివేసిన రఫా బోర్డర్‌(Rapha Border) క్రాసింగ్ మార్గాన్ని తెరిచేందుకు ఈజిప్ట్ అంగీకరించడం గాజా ప్రజలకు ఉపశమనం కలిగించే విషయం. తినడానికి తిండిలేక, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్న ప్రజలకు సాయం అందించాలంటే గాజా(Gaza)-ఈజిప్ట్(Ezypt) సరిహద్దులోని రఫా క్రాసింగ్‌ దాటాల్సి ఉంటుంది.

ఇప్పటికే మానవతా సాయం కింద సామగ్రితో కూడిన వందలాది ట్రక్కులు రఫా సరిహద్దు వద్ద బారులుతీరి ఉన్నాయి. అయితే భద్రతా కారణాలను చూపిస్తూ ఈజిప్ట్‌ ఈ మార్గాన్ని మూసివేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Bidden) ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌ సిసితో ఈ విషయంపై చర్చించారు. రఫా బోర్డర్‌ను తెరించేందుకు ఈజిప్ట్ అధ్యక్షుడు ఒప్పుకోవడంతో గాజాకు సాయం చేయడానికి మార్గం సుగమం అయ్యింది. కాకపోతే ఇది పరిమితంగా ఉండవచ్చని ఈజిప్ట్‌ అంటోంది. హమాస్‌ దాడుల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించడానికి కొంత సమయం పడుతుందని చెబుతోంది. మరిన్ని దాడులు జరిగే ఆస్కారం ఉందని ఆందోళనను వ్యక్తం చేసింది. శుక్రవారం నుంచి సాయం అందించేందుకు అనుమతిస్తామని ఈజిప్ట్‌ పేర్కొంది. ఇదిలా ఉంటే ధ్వంసమైన గాజా ప్రజల కోసం అమెరికా వంద మిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రకటించింది.

Updated On 19 Oct 2023 1:01 AM GMT
Ehatv

Ehatv

Next Story