Ecuador : ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్... ఎందుకో తెలుసా?
కరోనా(corona) స్వైరవిహారం చేస్తున్న సమయంలో చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్(Work from home) విధానాన్ని అమలు చేశాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత నెమ్మదిగా ఆ విధానానికి ముగింపు చెప్పాయి. ఇప్పుడు ఒకటి అర కంపెనీలు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
కరోనా(corona) స్వైరవిహారం చేస్తున్న సమయంలో చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్(Work from home) విధానాన్ని అమలు చేశాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత నెమ్మదిగా ఆ విధానానికి ముగింపు చెప్పాయి. ఇప్పుడు ఒకటి అర కంపెనీలు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కానీ ఓ దేశం మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. పౌత్ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లోని(Ecuador) ఉద్యోగులు గురు, శుక్రవారాలు ఇంటి నుంచే పని చేయాలని ఆ దేశ అధ్యక్షుడు డేనియల్ నొబోవా(Daniel Nobowa) ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి కారణం ఇంధన సంక్షోభమే. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్లలో నీటి స్థాయి అడుగంటిపోయింది. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈక్వెడార్‌లో అతి పెద్ద పవర్ ప్లాంట్ అయిన కొకా కొడా సింక్లైర్‌లో నీటి స్థాయిలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ఇదే కాదు అధికారుల అవినీతి, నిర్లక్ష్యం కూడా సంక్షోభానాకి కారణమని డేనియల్ అన్నారు. పరిస్థితి తీవ్రతను దాచిపెట్టారన్నారు. ఈక్వెడార్‌ను వర్షాభావ పరిస్థితులు ఇబ్బందిపెడుతున్నాయి. పక్కనేఉన్న కొలంబియా కరెంట్ ఎగుమతిని నిలిపివేయడంతో సమస్య మరింత తీవ్రతరమయ్యింది. అందుకే వర్క్ ఫ్రమ్‌హోమ్ ప్రకటన వచ్చింది. అన్నట్టు ఆ దేశంలో శాంతిభద్రతల సమస్య కూడా తీవ్రంగానే ఉంది.