Earthquake : జపాన్, అండమాన్ దీవుల్లో భూకంపాలు
జపాన్‌లోని హక్కైడోలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమాచారాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) శుక్రవారం అందించింది.

Earthquakes in Japan and Andaman Islands
జపాన్(Japan)లోని హక్కైడోలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమాచారాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (German Research Center for Geosciences) శుక్రవారం అందించింది. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి 46 కిమీ (28.58 మైళ్లు) దిగువన ఉన్నట్లు GFZ తెలిపింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అండమాన్ నికోబార్(Andaman Nicobar) దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు(Richter Scale)పై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. అయితే.. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center for Seismology) తెలిపింది. గురువారం, శుక్రవారం మధ్య రాత్రి పోర్ట్ బ్లెయిర్(Port Blair), అండమాన్ నికోబార్ దీవులకు 112 కి.మీ దూరంలో 4.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి 10 కి.మీ లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
