ఈశాన్య ఇరాన్‌ ప్రావిన్స్.. ఖోరాసన్ రజావిలోని కష్మర్ కౌంటీలో సంభవించిన భూకంపం కార‌ణంగా నలుగురు మరణించారు

ఈశాన్య ఇరాన్‌ ప్రావిన్స్.. ఖోరాసన్ రజావిలోని కష్మర్ కౌంటీలో సంభవించిన భూకంపం కార‌ణంగా నలుగురు మరణించారు. 5.0 తీవ్రతతో సంభ‌వించిన ఈ భూకంపం కార‌ణంగా కనీసం 120 మందికి పైగా గాయపడ్డారని స్థానిక‌ మీడియా నివేదించింది. గాయపడిన వారిలో 35 మంది ఆసుపత్రి పాలవ్వ‌గా.. మిగిలిన వారు చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.

భూకంపం ధాటికి భవనాలు కూల‌డంతో శిధిలాల కింద‌ ఇద్దరు బాధితులు మరణించారని.. జెండెహ్జాన్ గ్రామంలో భూకంప కేంద్రం సమీపంలో ఉన్న భవనం కూలిపోవడంతో మ‌రో ఇద్దరు మరణించారని.. జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. ప్రావిన్స్‌లోని అన్ని సర్వీస్, రెస్క్యూ, రిలీఫ్ సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

స్థానిక కాలమానం ప్రకారం.. 13:24 గంటలకు 6 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల అనేక భవనాలు, కార్లు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా తెలిపింది. కౌంటీలో జరిగిన ప్రాణనష్టం, ఆస్తి నష్టాలను అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story