China Earthquake : చైనాలో భారీ భూకంపం.. 111 మంది మృతి
చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఇప్పటివరకు 111 మంది మరణించగా.. మరో 200 మందికి పైగా గాయపడ్డారు
చైనాలో భారీ భూకంపం(China Earthquake) సంభవించింది. భూకంపం కారణంగా ఇప్పటివరకు 111 మంది మరణించగా.. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. చైనాలోని వాయువ్య ప్రావిన్స్‌లైన గన్సు(Gansu), కింగ్‌హై(Qinghai)లో సోమవారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది.
చైనా మీడియా నివేదికల ప్రకారం.. భూకంపం కారణంగా గన్సులో 100 మంది ప్రాణాలు కోల్పోగా, కింగ్‌హైలో 11 మంది మరణించారు. గన్సులో 96 మంది. కింగ్‌హైలో 124 మంది గాయపడ్డారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంప తీవ్రత 5.9 గా అంచనా వేయబడింది. భూకంపం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని చైనా అధికారులు చెబుతున్నారు. నీరు(Water) విద్యుత్(Electric) వ్యవస్థలు స్తంభించిపోయాయి. రవాణా(Transport), కమ్యూనికేషన్ల(Communication) మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు.