ఆఫ్ఘనిస్థాన్‌లో శుక్ర‌వారం మళ్లీ భూకంపం సంభవించింది. 24 గంటల్లో రెండోసారి భూకంపం రావడంతో ఆఫ్ఘన్‌లో భూమి వ‌ణికిపోయింది.

ఆఫ్ఘనిస్థాన్‌(Afghanistan)లో శుక్ర‌వారం మళ్లీ భూకంపం(Earthquake) సంభవించింది. 24 గంటల్లో రెండోసారి భూకంపం రావడంతో ఆఫ్ఘన్‌లో భూమి వ‌ణికిపోయింది. సమాచారం ప్రకారం.. భూకంప తీవ్రత 4.3 రిక్ట‌ర్ స్కేల్‌(Richter scale)గా అంచనా వేయబడింది. 17 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఇదిలావుంటే.. నిన్న కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. భూకంప‌ తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా ఉంది.

నిన్న ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం యొక్క‌ ప్ర‌భావం భారతదేశం(India)లోని ప‌లు రాష్ట్రాల్లో కూడా కనిపించింది. రాజధాని ఢిల్లీ(Delhi)లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించగా.. చాలా చోట్ల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు ప‌రుగులు తీశారు. పాకిస్థాన్‌(Pakistan)లోని పలు రాష్ట్రాల్లో కూడా భూకంపం సంభవించింది. లాహోర్‌(Lahore), ఫైజాబాద్‌, బలూచిస్థాన్‌లలో భూమి కంపించింది.

Updated On 11 Jan 2024 10:20 PM GMT
Yagnik

Yagnik

Next Story