Dubai : భారీ వర్షాలకు దుబాయ్ అతలాకుతలం.. నీట మునిగిన ఎయిర్పోర్ట్, మెట్రో స్టేషన్లు!
ఇక్కడ మనమేమో ఎండలతో తెగ ఇబ్బందిపడుతుంటే ఎడారి దేశంలోనేమో భారీ వర్షాలతో జనజీవితం అస్తవ్యస్తం అయ్యింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates) రాజధాని దుబాయ్‌లో(Dubai) ఎడతెగని వానలు(Rains) కురుస్తున్నాయి. వీధులు, ఇళ్లు, మాల్స్ అన్నింటిలోనూ నీళ్లు వచ్చేశాయి. ఆకస్మికంగావస్తున్న ఉరుములు(Thunder), మెరుపులు(Lightning) ప్రజలను వణికిస్తున్నాయి.

Dubai
ఇక్కడ మనమేమో ఎండలతో తెగ ఇబ్బందిపడుతుంటే ఎడారి దేశంలోనేమో భారీ వర్షాలతో జనజీవితం అస్తవ్యస్తం అయ్యింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates) రాజధాని దుబాయ్‌లో(Dubai) ఎడతెగని వానలు(Rains) కురుస్తున్నాయి. వీధులు, ఇళ్లు, మాల్స్ అన్నింటిలోనూ నీళ్లు వచ్చేశాయి. ఆకస్మికంగావస్తున్న ఉరుములు(Thunder), మెరుపులు(Lightning) ప్రజలను వణికిస్తున్నాయి. సోమవారం అర్థరాత్రి మొదలైన భారీ వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. ఆ దేశపు వాతావరణ కేంద్రం పలు ప్రాంతాలలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దుబాయ్, అబుదాబి, షారా ప్రజలను వాతావరణ కేంద్రంఅప్రమత్తం చేసింది. రాబోయే 48 గంటల్లో అస్థిర వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని హెచ్చరించింది. దుబాయ్, అబుదాబి, షార్జా, ఎమిరేట్స్‌లోని పలు ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు తమ వాహనాలను వరద ప్రాంతాలకు దూరంగా. సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలలో పార్క్ చేయాలని సూచించింది. స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, మాల్స్, రోడ్లు, వ్యాపార సంస్థలు వరద నీటిలో మునిగిపోయాయి. మరో అరబ్‌దేశం ఒమన్‌లో కూడా భారీగా వర్షాలు పడ్డాయి. భారీవర్షాల కారణంగా 18 మంది చనిపోయారు కూడా!
