Helen Marie Roberts : పాకిస్తాన్ బిగ్రేడియర్గా మొదటిసారి క్రైస్తవ మహిళ
పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో(Pakisthan) ఓ మహిళకు ఘనమైన గౌరవం దక్కింది. ఆ దేశ తొలి మహిళా బ్రిగేడియర్‌గా(Brigadier) డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్(Helen Marie Roberts) నియమితులయ్యారు. ఈ పదనిని చేపట్టిన తొలి క్రైస్తవ మైనారిటీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

Helen Marie Roberts
పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో(Pakistan) ఓ మహిళకు ఘనమైన గౌరవం దక్కింది. ఆ దేశ తొలి మహిళా బ్రిగేడియర్‌గా(Brigadier) డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్(Helen Marie Roberts) నియమితులయ్యారు. ఈ పదనిని చేపట్టిన తొలి క్రైస్తవ మైనారిటీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. పాకిస్తాన్ ఆర్మీ (Pakistan Army) మెడికల్ కోర్‌లో పనిచేస్తున్న రాబర్ట్స్ బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. సీనియర్ పాథాలజిస్ట్ అయిన డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ పాకిస్థాన్ ఆర్మీలో గత 26 ఏళ్లుగా పనిచేస్తున్నారు. హెలెన్ మేరీ రాబర్ట్స్‌కు బ్రిగేడియర్‌గా పదోన్నది లభించినందుకు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు అభినందనలు తెలిపారు.
