అగ్రరాజ్యం అమెరికాలో(america) త్వరలో అధ్యక్ష పదవికి ఎన్నికలు(President ELection) జరగబోతున్నాయి.

అగ్రరాజ్యం అమెరికాలో(america) త్వరలో అధ్యక్ష పదవికి ఎన్నికలు(President ELection) జరగబోతున్నాయి. ఈ పదవిని మరోసారి దక్కించుకోవాలన్న లక్ష్యంతో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక హామీలను ఇస్తున్నారు. నవంబర్‌లో జరిగే ఈ ఎన్నికలలో తనను గెలిపిస్తే ఆదాయపు పన్ను(Incometax) చెల్లింపుల నుంచి అమెరికన్లకు విముక్తి కలిగిస్తానని, దాని స్థానంలో విస్తృతమైన పన్నుల విధానాన్ని అంటే టారిఫ్‌ల పాలసీ(Traffic policy) అమలు చేస్తానని ట్రంప్‌ ప్రకటించారు. ఇంతకు ముందు అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ ఉన్నప్పుడు విదేశాంగ విధానంలో సుంకాలను బహుముఖ అస్త్రంగా ప్రయోగించారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలలో గెలిస్తే రక్షణాత్మక ధోరణితో కూడిన వాణిజ్య ఎజెండాను అమలు చేయాలని ట్రంప్‌ అనుకుంటున్నారు. అయితే ట్రంప్‌ ప్రతిపాదనపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆదాయ పన్ను స్థానంలో టారిఫ్‌లను తీసుకువస్తే దిగువ, మధ్యతరగతి అమెరికన్లు తీవ్రంగా నష్టపోతారని, సంపన్నులు మాత్రమే లబ్ధి పొందుతారని అంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story