రిపబ్లికన్‌ పార్టీ(Republic) అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై(Donald Trump) జరిగిన హత్యాయత్నం అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

రిపబ్లికన్‌ పార్టీ(Republic) అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై(Donald Trump) జరిగిన హత్యాయత్నం అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదృష్టం బాగుంది కాబట్టి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. ట్రంప్‌ కూడా ఆ షాక్‌ నుంచి తేరుకున్నారు. దేవుడి ఆశీస్సుల వల్లే మీ ముందు నిలబడగలిగానని, ఏమాత్రం పొరపాటు జరిగినా తాను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదన్నారు. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సు చివరి రోజు మూడోసారి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరిస్తూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. విశ్వాసం, బలం, ఆశతో కూడిన సందేశంతో అమెరికన్ల ముందు నిలబడ్డానంటూ తన స్పీచ్‌ను ప్రారంభించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉండేందుకు మీ నామినేషన్‌ను విశ్వాసం, భక్తితో గర్వంగా అంగీకరిస్తున్నానంటూ ట్రంప్‌ అన్నారు. ఈ ప్రయాణంలో తనతో సతీమణి మెలానియా అండగా ఉందని.. అందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్‌ అవుతోంది. ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి బహుశా ఈ వ్యక్తి దగ్గరే ట్రైనింగ్‌ తీసుకుని ఉంటాడని జోక్‌ చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story