Rape By 70 Men : భార్యను 70 మందితో రేప్ చేయించిన భర్త
71 ఏళ్ల డొమినిక్ పి అనే వ్యక్తి గత పదేళ్లుగా తన భార్యపై(Wife) 70 మంది పురుషులతో అత్యాచారం(Men) చేపించిన ఘటన ఫ్రెంచ్‌లో(France) వెలుగులోకి వచ్చింది.
71 ఏళ్ల డొమినిక్ పి అనే వ్యక్తి గత పదేళ్లుగా తన భార్యపై(Wife) 70 మంది పురుషులతో అత్యాచారం(Men) చేపించిన ఘటన ఫ్రెంచ్‌లో(France) వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై విచారణ సోమవారం అవిగ్నాన్‌లో ప్రారంభమైంది. తన భార్యకు పదేపదే మత్తుమందు ఇచ్చి పదేళ్లుగా 70 మంది పురుషులు ఆమెను 90 సార్లు అత్యాచారం చేయడానికి ప్రోత్సహించాడని భర్తపై కేసు నమోదైంది. దిగ్భ్రాంతికరమైన ఈ ఉదంతం ఫ్రాన్స్ అంతటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఒక దశాబ్దం పాటు సాగిన ఈ అత్యాచార ఘటనలు 2020లో మాత్రమే వచ్చింది. ఆమె 71 ఏళ్ల భర్త, EDF రిటైర్డ్ ఉద్యోగి(Retaired employe), ఆమెకు మత్తుమందు ఇచ్చి, ఆమెకు తెలియకుండానే అనేక మంది పురుషులు అత్యాచారం చేసేందుకు ప్రోత్సహించాడు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 72 మంది పురుషులు 92 సార్లు అత్యాచారాలకు పాల్పడ్డార., వారిలో 51 మందిని గుర్తించారు. 26 నుంచి 74 సంవత్సరాల వయస్సు గల నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. పది సంవత్సరాల పాటు భార్యపై అత్యాచారం జరుగుతున్న విషయం ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు భర్త. 2011లో ఈ జంట పారిస్ సమీపంలో నివసిస్తున్నప్పుడు ఈ దారుణచర్య ప్రారంభమైంది. రెండేళ్ల తర్వాత వారు మజాన్‌కు మారే వరకు కొనసాగింది. తన భార్యను లైంగికంగా అనుభవించేందుకు అపరిచిత వ్యక్తులను నియమించుకోవడానికి coco.fr అనే సైట్‌ను ఉపయోగించినట్లు పోలీసులు కనుగొన్నారు. నిందితుడు భార్యకు శక్తివంతమైన ట్రాంక్విలైజర్స్, టెమెస్టా అనే మత్తు మందును ఇచ్చేవాడు. అంతేకాదు తన భార్యపై అత్యాచారం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించి తన కంప్యూటర్‌లో భద్రపర్చాడు.
అయితే మరో నేరం చేస్తూ డొమినిక్ పట్టుబడడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.సెప్టెంబర్ 2020లో షాపింగ్ సెంటర్‌లో మహిళల స్కర్టుల కింద రహస్యంగా చిత్రీకరిస్తూ డొమినిక్ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఇతని కంప్యూటర్ తనిఖీ చేయగా భార్యపై అత్యాచారం చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రోవెన్స్‌లోని మజాన్‌లోని ఇంటిలో డజన్ల కొద్దీ అత్యాచారాల ఘటనల వీడియోలను కనుగొన్నారు. బాధితురాలిని చాలా మంది ఒకే ఒక్కసారి అత్యాచారం చేయగా, కొందరు గరిష్టంగా ఆరు సార్లు రేప్ చేశారు. నిందితులు, 21 నుంచి 68 సంవత్సరాల వరకు, ఫోర్క్‌లిఫ్ట్ డ్రైవర్, ఫైర్ ఆఫీసర్, కంపెనీ ఎగ్జిక్యూటివ్, జర్నలిస్ట్‌తో సహా వివిధ వృత్తుల్లో ఉన్నారు. ఆమెను తాకడానికి ముందు వారి చేతులను వేడి చేయాలి, వంటగదిలో బట్టలు విప్పాలనే షరతు విధించాడు. నిందితుడు కూడా అత్యాచారాల్లో పాల్గొన్నాడు, వాటిని రికార్డ్ చేశాడు. భార్యతో సంభోగం చేసే పురుషులను బూతులు మాట్లాడాలని ప్రోత్సహించేవాడట. ఈ సంఘటనపై ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. డిసెంబర్ వరకు ఈ విచారణ కొనసాగనుంది.