ఈ భూమికి ఏదో అయ్యింది.. లేకపోతే ఓ చోట భయంకరమైన వర్షాలు. మరోచోట కరువు కాటకాలు. ఇంకో చోట భూకంపాలు. మొత్తంగా ప్రకృతి వైపరిత్యాలు భూమిని అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నడూ లేనిది ఎండలు దంచికొడుతున్నాయి. ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించే విషయమేమిటంటే అమెజాన్‌ నదిలో(Amazon River) ఉష్ణోగ్రతలు(Temperature) పెరగడం.

ఈ భూమికి ఏదో అయ్యింది.. లేకపోతే ఓ చోట భయంకరమైన వర్షాలు. మరోచోట కరువు కాటకాలు. ఇంకో చోట భూకంపాలు. మొత్తంగా ప్రకృతి వైపరిత్యాలు భూమిని అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నడూ లేనిది ఎండలు దంచికొడుతున్నాయి. ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించే విషయమేమిటంటే అమెజాన్‌ నదిలో(Amazon River) ఉష్ణోగ్రతలు(Temperature) పెరగడం. ఈ వేడి కారణంగానే గత వారం రోజుల్లో లేక్‌ టెఫె(Lake Tefe) ప్రాంతంలో ప్రవహిస్తున్న అమెజాన్‌ నదిలో వందకు పైగా డాల్ఫిన్‌లు(dolphins) చనిపోయాయి. ఇంత ఎక్కువ సంఖ్యలో డాన్ఫిన్‌లు చనిపోవడం అసాధారణమైన విషయమని బ్రెజిల్‌ సైన్స్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న మామిరావా ఇన్‌స్టిట్యూట్‌ తెలిపిది. అమెజాన్‌ నదీ జలాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వీటి మరణానికి కారణం కావచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు అనుమానపడుతున్నారు. డాల్ఫిన్‌ల మరణానికి లేక్‌ టెఫె ప్రాంతంలోని అమెజాన్‌ నదీ జలాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రధాన కారణమని సైంటిస్టులు అంటున్నారు. ఇక్కడి జలాల్లో తరచుగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, పర్యావరణ సమతుల్యానికి ఇది ఆందోళన కలిగించే పరిణామమని చెబుతున్నారు. ప్రస్తుతం అమెజాన్‌ నదీ పరివాహక ప్రాంతంలోని ఉష్ణోగ్రతల కారణంగా నదిలో నీటి మట్టం తగ్గిపోతోంది. సుమారు 59 మున్సిపాలిటీల్లో సాధారణ స్థాయి కంటే నీటి మట్టం తగ్గిపోయింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు బ్రెజిల్ ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు అమెజాన్‌ నదిలోని డాల్ఫిన్‌లను మరో ప్రాంతానికి తరలించాలని, లేకుంటే మరింత ఎక్కువ సంఖ్యలో అవి చనిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ ఆలోచనను కొందరు శాస్త్రవేత్తలు తప్పుపడుతున్నారు. డాల్ఫిన్‌లను ఇతర నదీ జలాల్లోకి మార్చాలనే ఆలోచన సరైంది కాదని అంటున్నారు. వాటిని తరలించాలని భావిస్తున్న జలాల్లో టాక్సిన్స్, వైరస్‌లు ఉండే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Updated On 2 Oct 2023 7:04 AM GMT
Ehatv

Ehatv

Next Story