Al Shifa hospital : గాజాలో పరిస్థితి దారుణం.. నవజాత శిశువులను కూడా వదలని ఇజ్రాయెల్
పాలస్తీనియుల(Palestine) పట్ల ఇజ్రాయెల్(Israel) కర్కషంగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ సమాజం ఎంతగా చెబుతున్నా ఇజ్రాయెల్ మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. హమాస్‌ను(Hamas) అంతం చేయడమే లక్ష్యమని చెబుతూ అమయాక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇప్పటికే వేలాది మందిని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ రక్తదాహం ఇంకా తీరలేదు. ఫలితంగా గాజాలో ప్రస్తుతం భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి.
పాలస్తీనియుల(Palestine) పట్ల ఇజ్రాయెల్(Israel) కర్కషంగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ సమాజం ఎంతగా చెబుతున్నా ఇజ్రాయెల్ మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. హమాస్‌ను(Hamas) అంతం చేయడమే లక్ష్యమని చెబుతూ అమయాక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇప్పటికే వేలాది మందిని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ రక్తదాహం ఇంకా తీరలేదు. ఫలితంగా గాజాలో ప్రస్తుతం భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ దారణాలను మనిషన్నవాడెవరూ చూసి తట్టుకోలేరు. ప్రజలు నిస్సహాయంగా, బేలగా, భయంభయంగా బతుకున్నారు. ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు. ఇప్పుడక్క ఎక్కడ చూసినా కుప్పల కొద్దీ మృతదేహాలు(Corpse) కనిపిస్తున్నాయి. మరణమృదంగం ప్రతిధ్వనిస్తోంది. గాజాలోని ఆసుపత్రులన్నింటినీ ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. కరెంట్ సరఫరాను(Electricity Facility) నిలిపివేసింది. ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు లేక చాలా రోజులయ్యింది. ఇంక్యుబేటర్లకు(Incubater) కూడా కరెంట్ లేదు. ఆక్సిజన్(Oxygen) అందక కొన్ని రోజులయ్యింది. ఆసుపత్రుల్లో ఉన్న రోగులు, నవజాత శిశువులకు అంతిమగడియలు సమీపించాయి. ఎవరినీ బతికించలేని తమ నిస్సహాయస్థితికి డాక్టర్లు కుమిలిపోతున్నారు. గాజాలో(Gaza) అతి పెద్దదైన ఆల్ షిఫాతో(Al Shifa hospital) పాటు అన్ని హాస్పిటల్స్‌లోనూ ఇదే పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నవజాత శిశువులను కాపాడుకోవడానికి ఆల్ షిఫా హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. హృదయాలు ద్రవింపచేసే దృశ్యాలు అవి! ఆక్సిజన్ సరఫరా తదితరాలన్నీ నిలిచిపోయాయి. చిన్నారులను ఇంక్యుబేటర్ల నుంచి తీసుకెళ్లి సిల్వర్ ఫాయిల్‌లో చుట్టబెట్టిన మంచాలపై ఒక్క చోటే పడుకోబెడుతున్నారు. పక్కన వేడినీటిని ఉంచి శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.