బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ మెడికల్‌ స్కూల్‌ వైద్య విద్యార్థులకు ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం తెలిసింది.

బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ మెడికల్‌ స్కూల్‌ వైద్య విద్యార్థులకు ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం తెలిసింది. ఓ వ్యక్తి మూడు పురుషాంగాలతో జీవించినట్టు గుర్తించారు వారు. 78 ఏళ్ల ఓ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు మృతదేహాన్ని పరిశోధనలకు ఇచ్చారు. అతడి మృతదేహంపై పరిశోధనలు చేస్తున్న విద్యార్థులు అతడికి మూడు పరుషాంగాలు ఉన్నట్టు గుర్తించారు. ఇలాంటిది చాలా చాలా అరుదు. అరుదైన ఈ సమస్యను త్రిఫాల్లియా అంటారు. సదరు వ్యక్తికి ఓ పురుషాంగం బయటకు ఉండగా, అదనంగా ఉన్న రెండు పురుషాంగాలు బీజకోశంలో ఉన్నాయట! అయితే తనకు మూడు పురుషాంగాలు ఉన్నాయన్న విషయం అతడికి తెలిసి ఉండకపోవచ్చని వైద్య విద్యార్థులు అంటున్నారు. మూడు పురుషాంగాలు ఉన్నాయి కదాని ఆడు మగాడ్రా బుజ్జి అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇలాంటి సమస్య ఉన్నవారిలో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, అంగస్తంభన లోపం, సంతాన లేమి వంటి సమస్యలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇతడి కంటే ముందు 2020లో ఇరాక్‌లోని దుహోక్‌లో ఓ మూడు నెలల బాలుడికి మూడు పురుషాంగాలు ఉన్నట్టు గుర్తించారు. పెద్దవారిలో గుర్తించడం మాత్రం ఇదే మొదటిసారి.

Eha Tv

Eha Tv

Next Story