దీపావళి(Diwali) అంటే దీపాల వరుస. దీపాల పండుగ.. వెలుగుల పండుగ..జ్ఞాన జ్యోతులను వెలిగించే పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా జరుపుకునే పర్వదినం ఇది. మన దేశంలోనే కాదు, మిగతా దేశాలలో కూడా దీపావళి ఘనంగా జరుగుతుంటుంది. దుబాయ్‌(Dubai)లో కూడా దీపావళి సంబరాలు వైభవోపేతంగా జరుగుతాయి.

దీపావళి(Diwali) అంటే దీపాల వరుస. దీపాల పండుగ.. వెలుగుల పండుగ..జ్ఞాన జ్యోతులను వెలిగించే పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా జరుపుకునే పర్వదినం ఇది. మన దేశంలోనే కాదు, మిగతా దేశాలలో కూడా దీపావళి ఘనంగా జరుగుతుంటుంది. దుబాయ్‌(Dubai)లో కూడా దీపావళి సంబరాలు వైభవోపేతంగా జరుగుతాయి. దీపావళి రోజున ప్రజలు నూనె దీపాలు, కొవ్వొత్తులు వెలిగిస్తారు. రంగవల్లికలతో ఇంటిని తీర్చిదిద్దుతారు. దీపాలతో అలంకరిస్తారు. షాపులు, మాల్స్‌ అన్ని విద్యుద్దీపాలతో జిగేల్‌మంటాయి. షాప్‌లన్నీ వినియోగదారులతో కిటకిటలాడతాయి. పండుగకు పక్షం రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుందక్కడ. మార్కెట్‌లలో పట్టు చీరలు, కుర్తా-పైజామాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక స్వీట్‌షాపులు చెప్పనే అక్కర్లేదు. ఇక్కడిలాగే అక్కడ కూడా పేణీలకు బాగా డిమాండ్‌. పటాకులు కూడా బాగానే కాలుస్తారు. బుర్జ్ ఖలీఫా(Burj Khalifa), పామ్ జుమేరాలలో దీపావళి వేడుకలు చాలా గొప్పగా జరుగుతాయి. రెస్టారెంట్లలో ప్రత్యేక వంటకాలు ఉంటాయి. దుబాయ్‌లో నివసిస్తున్న భారతీయులే కాదు, పర్యాటకులు కూడా ఈ వంటకాల కోసం ఎగబడతారు.

Updated On 9 Nov 2023 1:50 AM GMT
Ehatv

Ehatv

Next Story