Denmark : పింగాణి ప్లేట్ల ముక్కలను పక్కింటి ముందు పారేస్తారు!
డెన్మార్క్‌లో(Denmark) కొందరు న్యూ ఇయర్ రోజున విచిత్రంగా బిహేవ్ చేస్తారు. చైర్ మీదకెక్కి కిందకు దూకుతుంటారు. సరదా అనుకునేరు. తమ క్షేమం కోసమే అలా చేస్తారు. ఎందుకంటే కుర్చీ నుంచి కిందకు దూకితే దుష్టశక్తులు(Evil energy) దగ్గరకు రావడానికి భయపడతాయట! అట్టాగే ఇంట్లో ఉన్న పింగాణి ప్లేట్లను(Ceramic plates) పగులగొట్టేసి, ఆ ముక్కలన్నింటినీ పక్కింటి ముందు పారేస్తారట! ఎందుకలా అంటే సేమ్ రీజన్ ! ఆ పగుళ్ల చప్పుళ్లకు దుష్టశక్తులు పారిపోతాయట! ఆఫ్రికాలోని (Africa)కొన్ని దేశాలలో ఇంట్లో ఉన్న పాత ఫర్నీచర్‌ను అంతా బయటపడేస్తారు.
డెన్మార్క్‌లో(Denmark) కొందరు న్యూ ఇయర్ రోజున విచిత్రంగా బిహేవ్ చేస్తారు. చైర్ మీదకెక్కి కిందకు దూకుతుంటారు. సరదా అనుకునేరు. తమ క్షేమం కోసమే అలా చేస్తారు. ఎందుకంటే కుర్చీ నుంచి కిందకు దూకితే దుష్టశక్తులు(Evil energy) దగ్గరకు రావడానికి భయపడతాయట! అట్టాగే ఇంట్లో ఉన్న పింగాణి ప్లేట్లను(Ceramic plates) పగులగొట్టేసి, ఆ ముక్కలన్నింటినీ పక్కింటి ముందు పారేస్తారట! ఎందుకలా అంటే సేమ్ రీజన్ ! ఆ పగుళ్ల చప్పుళ్లకు దుష్టశక్తులు పారిపోతాయట! ఆఫ్రికాలోని (Africa)కొన్ని దేశాలలో ఇంట్లో ఉన్న పాత ఫర్నీచర్‌ను అంతా బయటపడేస్తారు. థాయ్‌లాండ్‌లో(Thailand) అయితే బకెట్‌లతో నీటిని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. శరీరమంతా పౌడర్, బూడిద పూసుకుంటారు. రుమేనియాలో మరీ విచిత్రం! న్యూ ఇయర్ రోజున ఆవులతో(Cows) ముచ్చటిస్తే ఆ ఏడాదంతా విజయాలే వరిస్తాయన్నది అక్కడి ప్రజల నమ్మకం.
నమ్మకాలపై బోలెడన్ని లెక్చర్లు దంచే ఇంగ్లాండ్‌లోనూ(England) నమ్మకాలున్నాయి.. జనవరి ఫస్ట్‌న ఇంటికొచ్చే తొలి అతిథి తమకు గిఫ్ట్‌లు తేవాలని కోరుకుంటారు. అదో ట్రేడిషన్(Tradition) కాబట్టి వచ్చేవారు కూడా కానుకలు తెస్తారు. ఇలా గిఫ్టులు(Gifts) తెచ్చేవారు ఫ్రంట్‌డోరు నుంచి లోపలికి ఎంటరయ్యి బ్యాక్ డోర్ నుంచి వెళ్లిపోవాలట! న్యూ ఇయర్ ఎంటరవుతున్న వేళలో వట్టి చేతులతో వచ్చేవారిని ఛస్తే లోపలికి రానివ్వరట! అంతేనా నచ్చనివారు ఎవరైనా వస్తే డోర్ దగ్గరే నిలబెట్టేస్తారట! ఇంకో విచిత్రమైన నమ్మకం కూడా ఉంది. ఏడాది చివరి రోజు రాత్రి పురుష అతిథులు వస్తేనే మంచి జరుగుతుందట! స్త్రీలుగానీ, ఎర్రజుట్టు ఉన్న వ్యక్తులు కానీ వస్తే ఏడాదంతా చెడే జరుగుతుందట! ఏం నమ్మాకాలో