Adiddas-Puma : అడిడాస్, పూమా రెండు బ్రాండ్లు ఎవరివో..! మీకు తెలుసా..!
అడిడాస్(Adiddas), ప్యూమా(Puma) నేడు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ స్పోర్ట్స్(Sports) బ్రాండ్‌లలో ఈ రెండు ఉంటాయి.
అడిడాస్(Adiddas), ప్యూమా(Puma) నేడు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ స్పోర్ట్స్(Sports) బ్రాండ్‌లలో ఈ రెండు ఉంటాయి. అడిడాస్, పూమాకు 41.29 బిలియన్, 39.2 బిలియన్ యూరోల మార్కెట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు బ్రాండ్లను కోట్ల మంది ఇష్టపడుతారు. అయితే ఈ రెండు బ్రాండ్‌లు జర్మనీలోని ఒక చిన్న పట్టణంలో ప్రారంభమయ్యాయి. ఇద్దరు సోదరులు విజయవంతంగా షూ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారు. 1898, 1900లో జన్మించిన రుడాల్ఫ్ డాస్లర్, అడాల్ఫ్ డాస్లర్ జర్మనీలోని ఒక చిన్న పట్టణమైన హెర్జోజెనౌరాచ్‌లో పుట్టి పెరిగారు, ఆ సమయంలో షూ తయారీ ప్రధాన వ్యాపారంగా ఉంది. వారి తండ్రి కూడా పట్టణంలోని స్థానిక షూ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో తమ దేశం కోసం పోరాడిన తర్వాత, సోదరులు ఇంటికి తిరిగి వచ్చారు. సొంతంగా బూట్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలని కలలు కన్నారు. 1924లో డాస్లర్ బ్రదర్స్ షూ ఫ్యాక్టరీని స్థాపించారు. ముఖ్యంగా అథ్లెట్ల కోసం బూట్లు తయారు చేయడంలో నైపుణ్యం సాధించారు.
డాస్లర్ సోదరులు(Dassler brothers) వారి స్వస్థలంలో ఒక చిన్న షూ ఫ్యాక్టరీని స్థాపించారు. అవుట్‌గోయింగ్, వ్యాపార అవగాహన ఉన్న రుడాల్ఫ్ మార్కెటింగ్, విక్రయాల చూసుకునేవారు. అథ్లెట్ల మెరుగైన బూట్ల రూపకల్పనపై ఆడి డాస్లర్ దృష్టి సారించాడు. రుడాల్ఫ్ వ్యాపారం లాభదాయకంగా ఉండేలా చూసుకున్నాడు. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో అమెరికన్ స్ప్రింటర్ జెస్సీ ఓవెన్స్ డాస్లర్ బూట్లను ధరించి నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్న తర్వాత వారు చేసిన వీరి షూకు బాగా డిమాండ్ పెరిగింది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్ డాస్లర్స్‌కు ప్రపంచ గుర్తింపునిచ్చాయి. కానీ వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలలో విభేదాలు ప్రారంభమయ్యాయి. తోబుట్టువుల వైరం ఎలా మొదలైందనే దాని గురించి పెద్దగా తెలియదు. చివరికి, సోదరుల మధ్య విభేదాలు పెద్ద అగాధంగా మారాయి. 1948లో కంపెనీని విభజించాలని నిర్ణయించుకున్నారు. ఆడి డాస్లర్ అడిడాస్‌గా రీబ్రాండ్ చేశారు. రుడాల్ఫ్ ఔరాచ్ నదికి అవతలి వైపున తన సొంతగా మరో షూ కంపెనీని స్థాపించారు. ఇది మొదట రుడాగా తరువాత దానిని పూమాగా రీబ్రాండ్ చేశారు.
డాస్లర్ సోదరుల మధ్య తీవ్ర వైరం కుటుంబాన్ని మాత్రమే కాకుండా మొత్తం హెర్జోజెనౌరాచ్ పట్టణాన్ని విభజించింది. ప్రజల మధ్య స్పష్టమైన చీలిక తెచ్చారు. అడిడాస్, పూమా కంపెనీల షూలు, దుస్తులు ధరించేవారు విడిపోయారు. పూమా ఉద్యోగులు అడిడాస్‌లో పనిచేస్తున్న వారితో స్నేహం చేయడానికి నిరాకరించడంతో కుటుంబాలు కూడా చీలిపోయాయి. సోదరుల మధ్య వైరంతో రెండు బ్రాండ్లు ప్రపంచానికి పరిచయమయ్యాయి. ఒకదానికి ఒకటి పోటీనిస్తూ ముందుకు సాగుతున్నాయి.
అడిడాస్ కంపెనీ ఫుట్‌బాల్‌పై క్రీడాకారుల కోసం తన బ్రాండ్లను తయారుచేయడంలో ప్రతిభ కనబర్చింది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ముందుకు వెళ్లింది. మరోవైపు రుడాల్స్ ఆధ్వర్యంలోని పూమా బ్రాండ్ మర్కెటింగ్‌పై దృష్టిసారించింది. 1970లో పూమా బ్రెజిలియన్ ఫుట్‌బాల్ స్టార్ పెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓ రిఫరీ మ్యాచ్‌ను కాసేపు ఆపాలని సూచించి తాను షూ లేస్ కట్టుకోవడంతో ఈ బ్రాండ్‌కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. పూమా కంపెనీ మార్కెటింగ్ టెక్నిక్‌లో ఇది బాగా పనిచేసింది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ స్పోర్ట్స్ బ్రాండ్‌లలో రెండిటిని సృష్టించిన డాస్లర్ సోదరులు 1970లలో మరణించారు. వారి స్వస్థలమైన హెర్జోజెనౌరాచ్‌లోని అదే స్మశానవాటికలో వారిని సమాధి చేశారు. రెండు బ్రాండ్‌ల మధ్య చారిత్రాత్మక పోటీ వ్యాపార ప్రపంచంలో నిలిచిపోయింది. రెండు కంపెనీలు గొప్పగా నిలవడం గర్వకారణం.