ఓ మూఢ నమ్మకం(superstition) కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. చిన్నారుల జీవితాలను ఛిద్రం చేసింది. దీనికంతటికి కారణం ఓ జ్యోతిష్యురాలు(Astrologer). ఆన్‌లైన్‌లో వ్యక్తుల జాతకాలు చెబుతూ పాపులరయ్యిందామె! ఎలాంటి సమస్యకైనా పరిష్కారాలు చెప్పేది. ఆమె మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణానికి(Solar Eclipse) వణికిపోయింది. ఏమనుకుందో ఏమో కానీ దారుణానికి పాల్పడింది. ఈ విషాదఘటన అగ్రరాజ్యం అమెరికాలో(America) జరిగింది. డేనియల్ జాన్సన్‌(Daniel Johnson) అనే జ్యోతిష్యురాలు ఆన్‌లైన్‌లో జాతకాలు చెబుతూ, ఆధ్యాత్మిక సందేశాలిస్తూ చాలా ఫేమస్‌ అయ్యింది

ఓ మూఢ నమ్మకం(superstition) కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. చిన్నారుల జీవితాలను ఛిద్రం చేసింది. దీనికంతటికి కారణం ఓ జ్యోతిష్యురాలు(Astrologer). ఆన్‌లైన్‌లో వ్యక్తుల జాతకాలు చెబుతూ పాపులరయ్యిందామె! ఎలాంటి సమస్యకైనా పరిష్కారాలు చెప్పేది. ఆమె మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణానికి(Solar Eclipse) వణికిపోయింది. ఏమనుకుందో ఏమో కానీ దారుణానికి పాల్పడింది. ఈ విషాదఘటన అగ్రరాజ్యం అమెరికాలో(America) జరిగింది. డేనియల్ జాన్సన్‌(Daniel Johnson) అనే జ్యోతిష్యురాలు ఆన్‌లైన్‌లో జాతకాలు చెబుతూ, ఆధ్యాత్మిక సందేశాలిస్తూ చాలా ఫేమస్‌ అయ్యింది. సోమవారం అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది కదా! ఆమె ఎందుకో గ్రహణానికి వణికిపోయింది, కలవరపాటుకు గురయ్యింది. గ్రహణం ఏర్పడటానికి ముందు 'అమెరికాలో వచ్చే సూర్యగ్రహణం చాలా శక్తవంతమైనది. ఇప్పుడే మేల్కొనండి. గ్రహణం రాబోతున్నది. కొత్త ప్రపంచం రానుంది. ఏం చేయాలన్నా ఇదే సరైన సమయం' అంటూ ఆన్‌లైన్‌లో పోస్ట్‌ పెట్టింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే తన భాగస్వామిని చంపేసింది. తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని కారులో వేగంగా వెళ్లింది. ముక్కుపచ్చలారని తన కూతుళ్లను వేగంగా వెళుతున్న కారులోంచి విసిరేసింది. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల పాప ప్రాణాలతో బయటపడింది. ఎనిమిది నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె కారు కూడా ఓ చెట్టుకు ఢీకొని క్రాష్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో డేనియల్ జాన్సన్‌ కూడా దుర్మరణం చెందింది. ఆమె శరీరం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యింది. డేనియల్‌ను గుర్తుపట్టడానికి పోలీసులకు చాలాసేపు పట్టింది. విచారణలో జాన్సన్‌, అయోకా(Ayoka) ఇద్దరూ ఒకే వ్యక్తి అని తేలింది. డేనియల్‌ జాన్సన్‌నే ఆన్‌లైన్లో డేనియల్‌ అయోకాగా పిలుస్తారని, ఆమె ప్రముఖ జ్యోతిష్కురాలని పోలీసులు గుర్తించారు. ఆమె ఎందుకు ఇలా ప్రవర్తించిందో అంతుపట్టడం లేదు. గ్రహణాల కారణంగా విపత్తులు జరుగుతాయని జ్యోతిష్కులు, ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు కానీ వాటిల్లో ఎలాంటి నిజమూ లేదు. మన దేశంలో కూడా గ్రహణాల విషయంలో బోల్డన్ని అపోహలు ఉన్నాయి. చిత్రమేమిటంటే డేనియల్‌ ఉంటున్న లాస్‌ ఏంజిలిస్‌లో పాక్షిక గ్రహణమే ఏర్పడింది. అయినప్పటికీ ఆమె ఎందుకు భయాందోళనలకు గురయ్యిందో అర్థం కావడం లేదు.

Updated On 11 April 2024 1:56 AM GMT
Ehatv

Ehatv

Next Story