జమైకా రాజధాని కింగ్‌స్ట‌న్‌లోని ఓ కమ్యూనిటీలో శనివారం పోలీసులు కర్ఫ్యూను అమలు చేశారు. పబ్లిక్ మినీబస్సులో ఎక్కుతున్న వ్యక్తులపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు గాయ‌ప‌డ్డారు.

జమైకా(Jamaica) రాజధాని కింగ్‌స్ట‌న్‌(Kingston)లోని ఓ కమ్యూనిటీలో శనివారం పోలీసులు కర్ఫ్యూను అమలు చేశారు. పబ్లిక్ మినీబస్సులో ఎక్కుతున్న వ్యక్తులపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు గాయ‌ప‌డ్డారు. కింగ్‌స్టన్‌లోని సీవ్యూ గార్డెన్స్‌(Seaview Gardens)లో శుక్రవారం మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ దాడిలో గాయపడిన వారి ప్ర‌స్తుత‌ పరిస్థితిపై జమైకా పోలీసులు(Police) ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

ముష్కరులు బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తుల్లో ఒకరిని లక్ష్యంగా చేసుకున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఈ విష‌య‌మై అధికారులు ఎటువంటి స‌మాచార‌మివ్వ‌లేదు. హింస పెరగడానికి ప్రత్యర్థి ముఠాల మధ్య వైరుధ్యం కారణమని ఆరోపించారు. సీవ్యూ గార్డెన్స్‌లో రెండు రోజుల కర్ఫ్యూ విధిస్తూ అధికారులు ఆదేశించారు. కాల్పుల గురించి ప్రశ్నించగా.. ఇద్దరు వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు విడుదల చేసిన క్రైమ్ గణాంకాలు ప్ర‌కారం.. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 303 మంది మరణించిట్లు తెలుస్తుంది. 2022 సంవ‌త్స‌రంతో పోలిస్తే 20 శాతం త‌క్కువ‌.

Updated On 22 April 2023 11:36 PM GMT
Yagnik

Yagnik

Next Story