Petrol Price : అమాంతం పెరిగిన పెట్రోల్ ధర, లీటర్ రూ.450 మాత్రమే..!
పెట్రోల్ ధరలు(Petrol Price) ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏకంగా ఒకేసారి 500 శాతం పెరిగాయి. పాకిస్తాన్(Pakistan), శ్రీలంకలో(Sri lanka) పెట్రోల్ ధర రూ.250-రూ.350 వరకు ఉన్నాయి. అయితే ఈ సారి కరేబియన్(Caribbean) దేశం క్యూబాలో(Cuba) దాదాపు 500 శాతం పెట్రోల్ ధరలు పెరగడంతో ఆ దేశ ప్రజలపై విపరీతమైన భారం పడింది.
పెట్రోల్ ధరలు(Petrol Price) ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏకంగా ఒకేసారి 500 శాతం పెరిగాయి. పాకిస్తాన్(Pakistan), శ్రీలంకలో(Sri lanka) పెట్రోల్ ధర రూ.250-రూ.350 వరకు ఉన్నాయి. అయితే ఈ సారి కరేబియన్(Caribbean) దేశం క్యూబాలో(Cuba) దాదాపు 500 శాతం పెట్రోల్ ధరలు పెరగడంతో ఆ దేశ ప్రజలపై విపరీతమైన భారం పడింది. కరోనా, అమెరికా ఆంక్షలతో క్యూబా ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకునేందుకు భారీగా పెట్రోల్ ధరలను పెంచేసింది. క్యూబా కరెన్సీలో 25 పెసోలుగా ఉన్న లీటర్ పెట్రోల్ ధర 132 పెసోలుకు పెంచింది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.450 అన్నమాట. కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. ఇవేకాకుండా మున్ముందు డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉందని క్యూబా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో ప్రజలపై పెనుభారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.