ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ గురించిన పరిశోధనలు ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి . వుహాన్ లో గబ్బిలాల నుండి సేకరించిన నమూనాలు తో చేసిన ప్రయోగాల్లో గబ్బిలం వలనే భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందని ఇప్పటివరకు మనకు తెల్సిన సమాచారం . తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అధ్యయనాల్లో మాత్రం కరోనా రాకూన్ డాగ్స్ నుండి వచ్చిందని పేర్కొంటున్నారు

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ గురించిన పరిశోధనలు ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి . వుహాన్ లో గబ్బిలాల నుండి సేకరించిన నమూనాలు తో చేసిన ప్రయోగాల్లో గబ్బిలం వలనే భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందని ఇప్పటివరకు మనకు తెల్సిన సమాచారం . తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అధ్యయనాల్లో మాత్రం కరోనా రాకూన్ డాగ్స్ నుండి వచ్చిందని పేర్కొంటున్నారు .

2020 లో కరోనా పంజా విసిరిన అనంతరం ఈ వైరస్ మూలాలు గురించి శాత్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేపట్టారు. వుహాన్ లో మార్కెట్ నుండి వ్యాప్తి చెందింది అని కనుగొన్న వెంటనే మార్కెట్ ప్రదేశాన్ని ఖాళీ చేయించారు. ఆ మార్కెట్ లో అన్ని రకాల జంతువులను విక్రయించటం తోజంతువుల రక్తం, విసర్జిత పదార్దాలు వంటి అన్ని మూలలను పరీక్షించగా తేలిన విషయాలు కరోనా వైరస్ నమూనాను గబ్బిలం లో నమూనాలకు సరిపోలటంతో అక్కడి బృందం కరోనా వ్యాప్తికి మూలం గబ్బిలం అని చెప్పటం జరిగింది.

కరోనా వైరస్ పరిశోధనాల్లో కొత్త విశ్లేషణ వివరిస్తూ న్యూయార్క్ పత్రిక కొన్ని సంచలన విషయాలను ప్రచురించింది . కరోనా నమూనాలను పరిశోదించే సమయం లో అక్కడ రాకూన్ డాగ్స్ నమూనాలతో ఈ వైరస్ కణాలు ఎక్కువుగా పోలి ఉన్నాయని పేర్కొంది . ఈ విషయాలను చైనా శాస్త్రవేత్తలతో పంచుకొన్నపటికి Global Initiative on Sharing Avian Influenza Data,(GISAID) నుండి ఈసమాచారం మాయం అయినట్లు పేర్కొంది . రాకూన్ డాగ్స్ నుండి వైరస్ నేరుగా మనుషులకు సోకిందా లేక డాగ్స్ నుండి ఇతర జంతువులకు సోకి వ్యాప్తి జరిగిందా అనేదాని మీద మాత్రం శాస్త్రవేత్తలు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు . ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి జంతువుల నుండి వ్యాప్తి చెందింది కాదని మానవ కల్పిత వైరస్ అని సంచలన ఆరోపణలు కూడా ఒక దశలో వెల్లువెత్తాయి . అప్పట్లో ఈ వార్త గురించి చైనా లోని వుహాన్ ల్యాబ్ నుండి ఈ వైరస్ వ్యాప్తి జరిగింది అనే వాదనలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది చైనా ప్రభుత్వం.

Updated On 18 March 2023 2:02 AM GMT
Ehatv

Ehatv

Next Story