అమెరికాకు చెందిన అబ్బి(Abby), బ్రిట్నీ(Britney) హెన్సెల్‌లు కవలలు. మామూలు కవలలు కాదు, అవిభక్త కవలలు(Identical twins). కంజోయిన్డ్‌ ట్విన్స్‌(Conjoined twins) అన్నమాట! శరీరాలు అంటుకుని పుట్టిన కవలలు పెళ్లీడుకొచ్చారు.

అమెరికాకు చెందిన అబ్బి(Abby), బ్రిట్నీ(Britney) హెన్సెల్‌లు కవలలు. మామూలు కవలలు కాదు, అవిభక్త కవలలు(Identical twins). కంజోయిన్డ్‌ ట్విన్స్‌(Conjoined twins) అన్నమాట! శరీరాలు అంటుకుని పుట్టిన కవలలు పెళ్లీడుకొచ్చారు. పెళ్లి చేసుకోవడానికి అమెరికా ఆర్మీ రిటైర్డ్‌ అధికారి జోష్‌ బౌలింగ్‌(Josh Bowling) ముందుకొచ్చారు. 1996లో ది ఓప్రా విన్‌ఫ్రే షోలో ఈ కవలలు మొదటిసారిగా కనిపించారు. అప్పుడే వీరు ఫేమస్సయ్యారు. పెళ్లితో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. బ్రిట్నీ హాన్సెల్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో వారి పెళ్లి ఫోటో ప్రత్యక్షమయ్యింది. పెళ్లి దుస్తులలో ఈ అవిభక్త కలవలు జోష్‌ బౌలింగ్‌ చేతిని పట్టుకుని ఉండటం ఫోటోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ కవల సోదరీమణులు అయిదో తరగతి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. వీరి స్వస్థలం మిన్నెసోటా. ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. జోష్‌ బౌలింగ్‌ ఫేస్‌బుక్‌ పేజీలో కూడా పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. అబ్బి, బ్రిట్నీ హెన్సెల్‌లకు ఐస్‌ క్రీమ్‌ అందిస్తున్న ఫోటోలు, వెకేషన్ ఫోటోలు అందులో ఉన్నాయి. పెళ్లికి సంబంధించిన వీడియో క్లిప్‌ కూడా ఆయన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఉంది. అందులో వారు డ్యాన్స్‌ చేస్తూ కనిపిస్తున్నారు. అబ్బి, బ్రిట్నీ హెన్సెల్‌ల శరీరాలు అతుక్కుపోయి ఉంటాయి. అబ్బి కుడి చేయి, కుడి కాలును నియంత్రిస్తుంటే, బ్రిట్నీ ఎడమవైపు అవయవాలను కంట్రోల్‌ చేస్తుంది.

Updated On 30 March 2024 12:12 AM GMT
Ehatv

Ehatv

Next Story