Karnataka Political Survey : కర్ణాటకలో కాంగ్రెస్‌దే అధికారం.. సర్వే షాకింగ్ రిపోర్ట్.!
దక్షిణాదిన పాగా వేయాలని ఎప్పట్నుంచో పాటుపడుతున్న బీజేపీకి అది అంత సులభం కాదని అర్థమై ఉంటుంది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కర్ణాటక కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చేజారిపోనుందట! ఆర్‌ఎస్‌ఎస్ సర్వేలో ఈ విషయం తేటతెల్లమయ్యింది. త్వరలో కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం ఎదురుకానుందట. బీజేపీకి ఈసారి కేవలం 65 నుంచి 70 అసెంబ్లీ సీట్లు మాత్రమే లభించే అవకాశం ఉందని ఆర్‌ఎస్ ఎస్ సర్వే చెబుతోంది.
దక్షిణాదిన పాగా వేయాలని ఎప్పట్నుంచో పాటుపడుతున్న బీజేపీకి అది అంత సులభం కాదని అర్థమై ఉంటుంది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కర్ణాటక కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చేజారిపోనుందట! ఆర్‌ఎస్‌ఎస్ సర్వేలో ఈ విషయం తేటతెల్లమయ్యింది. త్వరలో కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం ఎదురుకానుందట. బీజేపీకి ఈసారి కేవలం 65 నుంచి 70 అసెంబ్లీ సీట్లు మాత్రమే లభించే అవకాశం ఉందని ఆర్‌ఎస్ ఎస్ సర్వే చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 115 నుంచి 120 సీట్లు సాధించి సునాయాసంగా అధికారంలోకి వస్తుందట. ఇందుకు సంబంధించిన ఓ కథనం కర్ణాటక దినపత్రిక కన్నడ ప్రభలో ప్రచురితమైందట. దానికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ నిర్వహించిన అంతర్గత సర్వే అని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కొత్త సర్వే కాదని, గతంలో నిర్వహించిన సర్వే అని అంటున్నారు. మరోవైపు కన్నడప్రభ కూడా తాము ఈ వార్తను ప్రచురించలేదని ప్రకటించింది.
ఈ ఫేక్ సర్వేపై బీజేపీ మండిపడుతోంది. బీజేపీకి రాష్ట్రంలో ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి భరించలేక కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నదని కర్ణాటక ఆరోగ్యమంత్రి డాక్టర్ సుధాకర్ విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని అన్నారు. ఈ సర్వే ఫేక్ అయి ఉంటే ఉండొచ్చు కానీ.. ఇటీవల నిర్వహించిన పలు సర్వేలలో కాంగ్రెస్‌కే అధికారం అని తేలింది. మొత్తం 224 స్థానాలలో కాంగ్రెస్‌కు 39 నుంచి 42 శాతం ఓట్లు లభిస్తాయని, 116 నుంచి 122 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి 77 నుంచి 83 సీట్లు రావచ్చని అంటున్నాయి. మొత్తంగా ఈసారి బీజేపీకి మాత్రం గడ్డుకాలమేనని సర్వేలు చెబుతున్నాయి.