బొద్దింకల(Cockroaches)కు చాలా మంది జడుసుకుంటారు. భయంతో కాదు .. అదో రకమైన అసహ్యంతో.. లేనిపోని వ్యాధులను తెచ్చిపెడతాయన్న భయం.. కాని బొద్దింకలను కూడా మరమరాలులా కరకరమనేస్తారని తెలుసా? ఈ సర్వ భక్షక కీటకాన్ని ఇష్టంగా తింటారని తెలుసా? మొహం అదోలా అసహ్యంగా పెట్టకండి.. నేను నిజమే చెబుతున్నా. చైనా(China)లో చాలా మందికి బొద్దింకలంటే చాలా ఇష్టం. మనం చేపలు, కోళ్లను పెంచుతున్నట్టే అక్కడ జిర్ర పురుగులను పెంచుతున్నారు.

బొద్దింకల(Cockroaches)కు చాలా మంది జడుసుకుంటారు. భయంతో కాదు .. అదో రకమైన అసహ్యంతో.. లేనిపోని వ్యాధులను తెచ్చిపెడతాయన్న భయం.. కాని బొద్దింకలను కూడా మరమరాలులా కరకరమనేస్తారని తెలుసా? ఈ సర్వ భక్షక కీటకాన్ని ఇష్టంగా తింటారని తెలుసా? మొహం అదోలా అసహ్యంగా పెట్టకండి.. నేను నిజమే చెబుతున్నా. చైనా(China)లో చాలా మందికి బొద్దింకలంటే చాలా ఇష్టం. మనం చేపలు, కోళ్లను పెంచుతున్నట్టే అక్కడ జిర్ర పురుగులను పెంచుతున్నారు. అది కూడా భారీ ఎత్తున .. ఇక్కడి ప్రజలలో చాలా మంది బొద్దింకల స్నాక్స్‌ తినేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. పిల్లలతో కూడా బొద్దింకల స్నాక్స్‌ తినిపిస్తారు. ఎందుకు అని అడిగామనుకోండి...జిర్ర పురుగులు, ఇతర కీలకటాలలో ప్రొటీన్‌ అధిక మోతాదులో ఉంటుందని, వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదని వారు చెబుతారు చైనాలోని షిచాంగ్‌ పట్టణంలో భారీ స్థాయిలో బొద్దింకల పెంపకం సాగుతోంది. బొద్దింకల పెంపకంలోనూ సాధకబాధకాలున్నాయట. అంత వీజీ కాదట! వీటి పెంపకం కోసం కలపతో ప్రత్యేకమైన బోర్డులు తయారు చేస్తారు. ఓ పద్దతి ప్రకారం వీటిని పెంచుతారు. ప్రస్తుతం చైనాలో వేల సంఖ్యలో బొద్దింకల ఫామ్‌లున్నాయి. నిర్వాహకులకు బాగానే ఆదాయం సమకూరుతున్నదట! హేమిటో.. చైనావాడు ఓ పట్టాన అర్థం కాడు కదా!

Updated On 18 July 2023 12:30 AM GMT
Ehatv

Ehatv

Next Story