CM Revanth Reddy : అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి
దక్షిణ కొరియా పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy) శనివారం నుంచి 10 రోజుల పాటూ అమెరికా(America), దక్షిణ కొరియాల(South Korea) అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ, ఇతర సేవల కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి వెంట పరిశ్రమలు, ఐటీ శాఖ(IT deparment) మంత్రి డి శ్రీధర్‌బాబు(sreedhar babu), ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌తో సహా అధికారిక బృందం ఉంటుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇతర ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలతో సహా ఐటీ కంపెనీల అధిపతులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. తన అమెరికా పర్యటనలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌ను కూడా కలవాలని సీఎం యోచిస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక సదస్సులో(World Economic Forum) భాగంగా దావోస్‌లో అగ్రశ్రేణి పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కొన్ని అమెరికా కంపెనీలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆయా సంస్థలతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించి పెట్టుబడుల పురోగతిపై సమీక్షించనున్నారు. సీఎం అమెరికా పర్యటన సందర్భంగా తెలంగాణ ఎన్నారైలతో కూడా సమావేశం కానున్నారు. పెట్టుబడులకు తెలంగాణ ఉత్తమ గమ్యస్థానమని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో బహుళజాతి కంపెనీలు తమ ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలోనే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.