Mexico Presient : మెక్సికో దేశాధ్యక్షురాలి పదవి చేపట్టనున్న మహిళ!
మెక్సికో(Mexico) దేశానికి మొదటిసరి ఓ మహిళ దేశాధ్యక్షురాలి పదవి చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో క్లాడియా షీన్‌బామ్ (Claudia Sheinbaum) విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్(Exist polls) చెబుతున్నాయి.
మెక్సికో(Mexico) దేశానికి మొదటిసరి ఓ మహిళ దేశాధ్యక్షురాలి పదవి చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో క్లాడియా షీన్‌బామ్ (Claudia Sheinbaum) విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్(Exist polls) చెబుతున్నాయి. మెక్సికో నగర మేయర్‌గా(Mayor) ఉన్న 61 ఏళ్ల క్లాడియా షీన్‌బాబ్ దాదాపు 56 శాతం ఓట్లతో దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించబోతున్నట్టు ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఆమెతో పోటీపడిన వ్యాపారవేత్త జోచిల్ గాల్వేజ్‌పై(Jochil Galvez) క్లాబియా విజయం ఖాయమైనట్టేనని అంటున్నారు. ప్రాథమిక ఫలితాలో క్లాడియా షీన్‌బామ్ ఆధిక్యతలో ఉన్నట్టు తెలిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవరూపం దాలిస్తే మాత్రం ప్రస్తుత దేశాధ్యక్షుడు ఆడ్రెస్ మాన్యువల్ లోపేజ్ ఒబ్రాడార్ గద్దె దిగాల్సి వుంఉటంది. ఆయన స్థానంలో క్లాడియా అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అనుకున్నట్టు అన్ని జరిగితే అక్టోబర్ 1వ తేదీన ఆమె కొత్త బాధ్యతను చేపడతారు.