సూడాన్‌(Sudan)లో అంతర్యుద్ధం పతాకస్థాయికి చేరుకుంది. సూడాన్‌ సైన్యం(Sudan's Army), ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌(Rapid Support Force)కు మధ్య జరుగుతున్న పరస్పర దాడులు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కాల్పుల చప్పుళ్లతో బాంబుల మోతలతో దేశం అట్టుడికిపోతున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి అబ్దుల్లా హమ్దోక్‌ను గత ఏడాది సైన్యం, ఆర్‌ఎస్‌ఎఫ్‌ చేతులు కలిపి పదవిలోంచి దించేశాయి. అప్పట్నుంచి పరిపాలన వీరి చేతుల్లోకి వెళ్లింది.

సూడాన్‌(Sudan)లో అంతర్యుద్ధం పతాకస్థాయికి చేరుకుంది. సూడాన్‌ సైన్యం(Sudan's Army), ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌(Rapid Support Force)కు మధ్య జరుగుతున్న పరస్పర దాడులు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కాల్పుల చప్పుళ్లతో బాంబుల మోతలతో దేశం అట్టుడికిపోతున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి అబ్దుల్లా హమ్దోక్‌ను గత ఏడాది సైన్యం, ఆర్‌ఎస్‌ఎఫ్‌ చేతులు కలిపి పదవిలోంచి దించేశాయి. అప్పట్నుంచి పరిపాలన వీరి చేతుల్లోకి వెళ్లింది. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎఫ్‌(RSF)ను సైన్యంలో వీలినం చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చాడు సైన్యాధ్యక్షుడు జనరల్‌ అబ్దుల్‌ ఫతాహ్‌ అల్‌- బుర్హాన్‌(Abdul Fatah al-Burhan). ఈ ప్రతిపాదనను ఆర్‌ఎస్‌ఎఫ్‌ చీఫ్‌ జనరల్‌ మొహమ్మద్‌ హమ్దాన్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. అప్పట్నుంచి రెండు సాయుధ విభాగాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.

ఈ దాడుల కారణంగా అక్కడ ఉన్న భారతీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గడపదాటి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు 270 మందికి పైగా మరణించారు. గడచిన 24 గంటల్లో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితులు మరింత విషమం కాకముందే అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని భారత్‌ అనుకుంటోంది. కర్ణాటక సంప్రదాయ మూలిక వైద్యం చేసే 31 మంది హుక్కీ పిక్కీ గిరిజనులతో పాటు 60 మంది భారతీయులు ప్రస్తుతం సూడాన్‌లో చిక్కుకుపోయారు. రాజధాని ఖార్తూమ్‌లో జరిగిన కాల్పులలో భారతీయ మాజీ సైనికుడు ఆల్బర్ట్‌ అగస్టీన్‌ చనిపోయారు.

ప్రస్తుతం సూడాన్‌లో దాదాపు నాలుగు వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 12 వందల మంది అక్కడే నివాసాలు ఏర్పరుచుకున్నారు. 150 ఏళ్ల కిందటే వారంతా అక్కడికి వలస వెళ్లారు. ఓ రకంగా వారిప్పుడు సూడాన్‌ దేశస్తులే! మిగిలిన వారు ఉద్యోగాల కోసం వెళ్లారు. కొందరు అంతర్జాతీయ సంస్థల్లో పని చేస్తున్నారు. హుక్కీ పిక్కీల కోసం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్రమంత్రి జైశంకర్‌ మధ్య ట్వీట్ల వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే కదా! సూడాన్‌లో చిక్కుకుపోయిన హుక్కీ పిక్కీలను వెంటనే ఇండియాకు తీసుకురావాల్సిందిగా సిద్ధరామయ్య కోరుతున్నారు. హుక్కీపీక్కీలు వందల ఏళ్ల కిందట గుజరాత్‌ నుంచి కర్ణాటకకు వలస వచ్చిన గిరిజనులు. ఈ తెగ అడవుల్లో ఉంటూ మూలికా వైద్యం చేస్తారు. వీరు మాట్లాడే భాష వగ్రీబూలి.. హుక్కీపిక్కీలకు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలు కూడా వచ్చు. పేద దేశమైన సూడాన్‌లో ఖరీదైన ఆలోపతి వైద్యం చేయించుకునే స్థోమత చాలా మందికి లేదు. పేదలంతా మూలికా వైద్యం చేయించుకుంటారు. మూలికా వైద్యం చేసేందుకే కర్ణాటక గిరిజనులు సూడాన్‌కు వెళ్లారు.

Updated On 19 April 2023 11:45 PM GMT
Ehatv

Ehatv

Next Story