చందమామపై(Moon) నీటి(Water) జాడలు ఉన్నాయా?
చందమామపై(Moon) నీటి(Water) జాడలు ఉన్నాయా? అంటే ఉన్నాయని ఇంతకు ముందు చాలా పరిశోధనలలో తేలింది. మన ఇస్రో శాస్త్రవేత్తలు(ISRO) కూడా ఈ మాట చెప్పారు. ఇప్పుడు చైనా(China) సైంటిస్టులు కూడా జాబిల్లిపై నీటి ఆనవాళ్లు(Water) ఉన్నాయని అంటున్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన మట్టి నమూనాలను పరీక్షిస్తే నీటి జాడ కనిపించిందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(chinnese academy of sciences) తెలిపింది. 2020లో చైనా ప్రయోగించిన చాంగే-5 స్పేస్‌క్రాఫ్ట్ చందమామ నుంచి మట్టి నమూనాలను తెచ్చింది. రెండు కిలోల మట్టి, రాళ్ల నమూనాలను భూమికి తెచ్చింది. వీటిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ నమూనాలలో భారీ స్థాయిలో నీటి అణువులు ఉన్నట్టు చైనా సైంటిస్టులు గుర్తించారు. 2009లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్–1 స్పేస్‌క్రాఫ్ట్ కూడా జాబిల్లిపై నీటి జాడలు ఉన్నట్టు పసికట్టింది.