1 Wife 4 Lovers : ఒకే ఇంట్లో నలుగురి మహిళలతో కాపురం..
ఒకొరికొకరు తెలియదు..! వీడు మహాజాదుగాడబ్బా..
ఇప్పటి కాలంలో ఒకరిని మెయింటెయిన్ చేయడమే కష్టంతో కూడుకున్నపని. భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే నిమిషాల్లో పట్టేస్తున్నారు. అలాంటి సమయంలో ఓ వ్యక్తి ఒకే ఇంట్లో ఏకంగా నలుగురు వ్యక్తులతో కాపురం పెట్టేశాడు. అదీ కూడా ఒకరికొకరు తెలియకుండా. మళ్లీ అందరి దగ్గర అప్పులు తీసుకున్నాడు.. అప్పులు తీర్చాలని ఒత్తిడి పెరగడంతో ఇతగాడి వ్యవహారం బయటపడింది. చైనాలో(China) ఈ ఘటన జరిగింది.
చైనాలోని ఒక వివాహితుడు ఒకే అపార్ట్‌మెంట్‌లో(Apartment) తన రెండో భార్యతో(Second) పాటు మరో ముగ్గురితో కాపురం పెట్టేశాడు.విశేషమేమిటంటే ఇలా ఒకరికొకరు తెలియకుండా నాలుగేళ్లు మెయింటెన్ చేశాడు. చైనీస్ సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరలవుతోంది. జియోజున్ అనే మారుపేరుతో పిలువబడే వ్యక్తి ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌కు(Jilin province) చెందినవాడు. ఆర్థికంగా చాలా లో క్లాస్ నుంచి వచ్చాడు. స్కూల్ చదువు కూడా పూర్తి చేయకున్నా యువతులతో సంబంధాలు పెట్టుకోవడంలో డాక్టరేట్ చేశాడు. జియోజున్ అనే వ్యక్తి తనకు తాను సంపన్న కుటుంబం నుంచి వచ్చినట్లు పరిచయం చేసుకున్నాడు. తల్లి బాత్‌రూం వాషింగ్ అటెండెంట్‌గా పనిచేస్తోంది. తండ్రి చిన్నచిన్నకన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసేవాడు. ఇంతలోనే ఓ యువతి జియోజియాను ఆకుట్టుకునేందుకు ఖరీదైన బహుమతులను అందించేవాడు. నకిలీ వస్తువులను లగ్జరీ బ్రాండ్ల వస్తువులుగా చెప్పి బహమతులు ఇచ్చాడు. దీంతో ఆ అమాయకురాలు కూడా ఈ మాయగాడికి పడిపోయింది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. దీంతో జియోజియా గర్భం దాల్చడంతో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇతని అసలు రూపం బయటపడింది. కొన్నాళ్లు సర్దుకుపోయినా ఇతని వ్యవహారశైలి నచ్చక ఆమె జియాజున్‌ను వదిలేసివెళ్లిపోయింది.
ఆ తర్వాత మరో యువతి జియాహోంగ్‌ను ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకుని పాత కథలే మళ్లీ చెప్పాడు. ఆమె నుంచి లక్షా 40 వేల యువాన్లను అప్పుగా తీసుకున్నాడు. ఆ యువతితో కలిసి ఉండేందుకు ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా మరో ముగ్గురు యువతులను ట్రాప్ చేశాడు. యూనివర్సిటీ విద్యార్థులైన జియోమిన్, జియాక్సిన్, జియోలాన్ అనే యువతులను తెచ్చేసుకొని తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే వేర్వేరుగా ఉంచారు. వారి నుంచి చిన్న చిన్న రుణాలను కూడా తీసుకున్నాడు. ఇలా నాలుగేళ్లు ఒకరికి తెలియకుండా ఒకరితో గడపడం విశేషం. అయితే ఒకరోజు అతని బ్యాగ్‌లో నకిలీ కరెన్సీ దొరకడంతో ఈ వ్వవహారం బయటపడింది. దీంతో ఇతగాడి మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా జియాజున్‌ను అరెస్ట్ చేశారు.