Chinese Man Killed 1100 Chickens : పక్కింటోడిపై పగపట్టాడు, విచిత్రంగా 1,100 కోళ్లను చంపేశాడు..
ఇరుగుపొరుగు వారు గొడవ పడటం సహజం. పగలు ప్రతీకారాలు తీర్చుకునేంత తీవ్ర స్థాయిలో కొట్లాడరు. కానీ పక్కింటి వ్యక్తిపై పగపట్టిన ఓ వ్యక్తి అతడిని ఆర్ధికంగా దెబ్బతీయాలన్న ప్లాన్ వేశాడు. అతడి కోళ్లఫాంకి వెళ్లి సుమారు 1,100 కోళ్ల మరణానికి కారణమయ్యాడు. గూ, జోంగ్ అనే ఇద్దరు ఇరుగుపొరుగు ఇళ్లల్లో నివసిస్తుంటారు. లాస్టియర్ ఏప్రిల్‌లో గూ అనుమతి లేకుండా అతడి చెట్లను జోంగ్ నరికేశాడు. అప్పట్నుంచి ఇద్దరి మధ్యన మాటలు బందయ్యాయి. జోంగ్‌పై పీకల్దాక కోపం పెంచుకున్నాడు గూ.. అతడిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు.

Chinese Man Killed 1100 Chickens
ఇరుగుపొరుగు వారు గొడవ పడటం సహజం. పగలు ప్రతీకారాలు తీర్చుకునేంత తీవ్ర స్థాయిలో కొట్లాడరు. కానీ పక్కింటి వ్యక్తిపై పగపట్టిన ఓ వ్యక్తి అతడిని ఆర్ధికంగా దెబ్బతీయాలన్న ప్లాన్ వేశాడు. అతడి కోళ్లఫాంకి వెళ్లి సుమారు 1,100 కోళ్ల మరణానికి కారణమయ్యాడు. గూ, జోంగ్ అనే ఇద్దరు ఇరుగుపొరుగు ఇళ్లల్లో నివసిస్తుంటారు. లాస్టియర్ ఏప్రిల్‌లో గూ అనుమతి లేకుండా అతడి చెట్లను జోంగ్ నరికేశాడు. అప్పట్నుంచి ఇద్దరి మధ్యన మాటలు బందయ్యాయి. జోంగ్‌పై పీకల్దాక కోపం పెంచుకున్నాడు గూ.. అతడిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. తరచూ రాత్రి వేళల్లో జోంగ్‌కు చెందిన కోళ్ల ఫాంకు వెళ్లి వచ్చేవాడు. ఆ క్రమంలోనే ఓ చక్కటి ప్లాన్ వేశాడు. ఓ రాత్రి జోంగ్ కోళ్ల ఫాంకు వెళ్లి గూ అకస్మాత్తుగా ఫ్లాష్‌లైట్ ఆన్ చేశాడు. ఒక్కసారిగా వెలుతురు వచ్చేసరికి కోళ్లు భయపడిపోయాయి. అన్ని ఓ మూలకు పరుగెత్తుకుంటూ వెళ్లాయి. ఆ క్రమంలో ఒకదానిపై ఒకటి పడిపోయాయి. తొక్కిసలాటన్నమాట. అలా ఓ 500 కోళ్లు చనిపోయాయి. ఈ విషయం జోంగ్‌కు తెలిసింది.. అతడు పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు. 500 కోళ్ల మరణానికి కారణమైన గూ కు 35,713 రూపాయల జరిమానా విధించారు. జైల్లో తోశారు. జైల్లో ఉన్న గూ తన పక్కింటి జోంగ్‌పై మరింత కోపాన్ని పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ రాత్రిపూట కోళ్లఫాంకు వెళ్లాడు. మరోసారి ఫ్లాష్‌లైన్ ఆన్ చేశాడు. ఈసారి పాపం 640 కోళ్లు చనిపోయాయి. పోలీసులు వచ్చి మళ్లీ అతడికి అరదండాలు వేసి కోర్టుకు తీసుకెళ్లారు. కుతంత్రంతో జోంగ్ కోళ్లను చంపి నష్టం కలిగించాడని నిర్ధారించిన కోర్టు గూను దోషిగా తేల్చింది. ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. మరణించిన 1,100 కోళ్ల విలువ లక్షా 60 వేల రూపాయలకు పైనే ఉంటుందట! గూ ప్రతీకారానికి పాపం అమాయక కోళ్లు చనిపోవడమే బాధాకరమైన విషయం!
