Bouncing Bed : శృంగారంలో పాల్గొనే జంటల కోసం 'బౌన్సింగ్ బెడ్'
ఈ కాలంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

ఈ కాలంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేందుకు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. సాంకేతిక మార్పుల వల్ల ప్రజలకు మరింత సౌకర్యవంతమైన వస్తువులను తయారు చేయడం చాలా సులభమవుతోంది. ఈ తరహాలోనే మరో బెడ్‌ను తయారుచేశారు. 'బౌన్సింగ్ బెడ్'(Bouncing bed) పేరుతో కొత్త వస్తువును మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. చైనాకు చెందిన సైమన్స్ గ్రూప్ స్లీప్ టెక్నాలజీ(Group Sleep Technology) బౌన్సింగ్ బెడ్ పేరుతో ఓ ప్రత్యేకమై బెడ్‌ను ఉత్పత్తి చేసింది. అధిక సమయం శృంగారంలో(Romance) పాల్గొనేవారికి ఇది మరింత సౌకర్యంగా ఉంటుందట. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ బెడ్‌పై మహిళ వెల్లకిలా పడుకుని ఉంటుంది. పక్కనే ఉన్న సేల్స్ మన్ రిమోట్‌తో కంట్రోల్ ఈ బౌన్సింగ్ బెడ్‌ను ఆపరేట్ చేస్తాడు. ఈ బౌన్సింగ్ బెడ్ శృంగార భంగిమలో పైకి, కిందకు బౌన్స్ అవుతుంది. శృంగారంలో పాల్గొనే కపుల్స్‌కు మరింత సౌకర్యాన్ని, తృప్తిని కలిగించడం కోసం బెడ్‌ను ఇలా తయారు చేశారు. అయితే దీని ధర, ఇది ఎక్కడ లభిస్తుందనే సమాచారమైతే లేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులరయింది.
Chinese invention: The Bouncing Bed – spicing things up for couples!
— Interesting STEM (@InterestingSTEM) August 24, 2024
pic.twitter.com/60ZT7zlIc0
