దేశ ఆర్ధిక వ్యవస్థపై(Country Economic) రియల్‌ ఎస్టేట్‌(Real estate) రంగం ప్రభావం చాలా ఉంటుంది. ఒక్కసారి రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైతే దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా తలకిందులవుతుంది. ఆర్ధికవేత్తలు చెబుతున్నది కూడా ఇదే! ఇప్పుడు చైనాలో ఇదే జరుగుతోంది. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ రంగం పీకల్లోతూ నష్టాల్లో కూరుకుపోయింది. చైనా(china) స్థూల జాతీయోత్పత్తిలో రియల్ ఎస్టేట్‌ రంగం వాటా 30 శాతానికి మించి ఉంది. రియల్ ఎస్టేట్‌ సంక్షోభంలో పడింది.

దేశ ఆర్ధిక వ్యవస్థపై(Country Economic) రియల్‌ ఎస్టేట్‌(Real estate) రంగం ప్రభావం చాలా ఉంటుంది. ఒక్కసారి రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైతే దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా తలకిందులవుతుంది. ఆర్ధికవేత్తలు చెబుతున్నది కూడా ఇదే! ఇప్పుడు చైనాలో ఇదే జరుగుతోంది. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ రంగం పీకల్లోతూ నష్టాల్లో కూరుకుపోయింది. చైనా(china) స్థూల జాతీయోత్పత్తిలో రియల్ ఎస్టేట్‌ రంగం వాటా 30 శాతానికి మించి ఉంది. రియల్ ఎస్టేట్‌ సంక్షోభంలో పడింది. అడ్డూ అదుపూ లేకుండా, అంచనాలేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు భవంతులను నిర్మించాయి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు. చేతులు పూర్తిగా కాలిన తర్వాత ఇప్పుడు ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటికే జనాభాకు మించిన గృహాలున్నాయి. ఇవి చాలవన్నట్టుగా లెక్కకు మించిన ఇళ్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చైనాలో నివాస గృహాల సంఖ్య ఎంతకాదనుకున్నా వంద కోట్లకుపైగానే ఉంటుంది. ఇవి ఈజీగా 300 కోట్ల మందికి సరిపోతాయి. 'చైనాలో ఖాళీగా ఉన్న ఇళ్ల(Empty Houses) సంఖ్యపై ఒక్కో నిపుణుడు ఒక్కో మాట చెబుతున్నాడు. ఒక్కటి మాత్రం నిజం. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్మాణం పూర్తయి అందుబాటులో ఉన్న ఖాళీ ఇండ్లు కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయి' అని దేశ స్టాటిస్టిక్స్‌ బ్యూరో మాజీ డిప్యూటీ హెడ్‌ హే కేంగ్‌ తెలిపాడు.

రెండేళ్ల నుంచి చైనాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దిగ్గజ సంస్థలన్నీ దివాలా తీశాయి. సమస్య చాలా తీవ్రంగా ఉందక్కడ! దేశమంతటా ఎక్కడ చూస్తే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అపార్ట్‌మెంట్లే ఇందుకు ప్రధాన కారణం. దేశం నలుమూలాల ఇంకా లెక్కలేనన్ని ఆపార్ట్‌మెంట్లు నిర్మాణంఓ ఉన్నాయి. అయితే వినియోగదారులు లేక భవన నిర్మాణ సంస్థలన్నీ అల్లాడిపోతున్నాయి. చేసిన అప్పులు తీర్చలేక 2021లో చైనా రియల్టీ దిగ్గజం ఎవర్‌ గ్రాండ్‌ గ్రూపు దివాలా తీసింది. అతి పెద్ద నిర్మాణ సంస్థ కంట్రీ గార్డెన్‌ పరిస్థితి కూడా దయనీయంగా తయారయ్యింది. చైనాలో ఆగస్టు నాటికే 700 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణానికి సమానమైన ఇళ్లు అమ్ముడు కాకుండా ఖాళీగా పడి ఉన్నాయి. అర్థమయ్యేట్టు చెప్పాలంటే 72 లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఖాళీగా ఉన్నాయన్నమాట! రియల్‌ ఎస్టేట్‌ సంస్థల దగ్గర డబ్బుల్లేక కొన్ని అపార్ట్‌మెంట్లను సగానికి పైగా కట్టి వదిలేశాయి. ఇలాంటి పూర్తికాని ఇళ్ల ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. 2016లో మార్కెట్లు కళకళలాడుతున్న సమయంలో చాలా మంది ఫ్లాట్లను కొన్నారు. అలా కొన్నవారంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. చైనా ప్రభుత్వానికి ఈ రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభం సవాల్‌ను విసురుతోంది. చైనా జీడీపీలో దాదాపు 30 శాతం వాటా రియల్టీ రంగానిదే అవ్వడం వల్ల ఆందోళన చెందుతోంది. పట్టణాలకు పట్టణాలే ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. క్వింగ్‌ హుయి, జెంగ్‌ డాంగ్, చెన్‌ గాంగ్, బిన్‌ హయీ వంటివి శ్మశాన నగరాలుగా మారాయి.
1970 తర్వాత చైనాలో పట్టణీకరణ స్పీడందుకుంది. గ్రామీణ ప్రజలు పని వెతుక్కుంటూ పట్టణాల బాట పట్టింది కూడా అప్పుడే! ఈ కారణంగానే ఇప్పుడు చైనాలో పట్టణ జనాభా 64 శాతానికి పెరిగింది. గ్రామీణ చైనాలో కేవలం 36 శాత మంది ప్రజలే నివసిస్తున్నారు. అందరూ పట్టణాలకు వెళ్లిపోవడంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. రియల్ బూమ్‌ యాభై ఏళ్లుగా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు టప్‌మని పేలిపోయింది.

Updated On 25 Sep 2023 6:33 AM GMT
Ehatv

Ehatv

Next Story