China : చైనాలో చెట్టెక్కి వేలాడుతున్న యువత... ఎందుకంటే!
చైనాలో(china) వింత దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా యువతీ యువకులు పక్షుల్లా రెక్కలున్న దుస్తులు(Wing Cloths) వేసుకుంటున్నారు.
చైనాలో(china) వింత దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా యువతీ యువకులు పక్షుల్లా రెక్కలున్న దుస్తులు(Wing Cloths) వేసుకుంటున్నారు. పక్షుల్లాగే శబ్దాలు చేస్తున్నారు. కొందరు గబ్బిలాల(Bats) లాగా చెట్టుకు వేలాడుతున్నారు. ఇదంతా చూసి వారికి మతి పోయిందని అనుకునేరు. ప్రభుత్వాలు తీసుకున్న మతిలేని చర్య కారణంగానే వారు ఆ విధంగా నిరసన తెలుపుతున్నారు. చైనాలో కొత్తగా 996 పని విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంలో ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేయాలి. రోజుకు 12 గంటలన్నమాట(working hours)! ఇలా వారానికి 6 రోజులు పని చేయాలి. ఈ పని విధానంపైనే యువతీ యువకులు మండిపడుతున్నారు. ఈ వర్క్ కల్చర్‌ను వ్యతిరేకిస్తూ పక్షుల తరహా దుస్తులు ధరిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన రెక్కల్ని ధరించి చెట్లు ఎక్కుతున్నారు. కుర్చీలు, టేబుళ్లు ఎక్కి నిరసన తెలుపుతున్నారు. గంటల కొద్ది ఉన్న పని విధానం నుంచి తమకు విముక్తి కలిగించాలని, పక్షుల్లా తమకూ స్వేచ్ఛ కావాలని కోరుతూ ఇలా ప్రవర్తిస్తున్నారట!. ఇటీవల డిగ్రీని పూర్తి చేసుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు ఆందోళన చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఉన్నారు. ర్యాట్‌రేస్‌లాంటి వర్క్ కల్చర్ వల్ల ఆరోగ్యం పాడవుతున్నదని వాపోతున్నారు.