అమ్మాయిలు.. ప్లీజ్‌ పెళ్లి చేసుకోండి. చక్కగా పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కనండి.. యువతులకు ఇలాంటి విన్నపాలు, విజ్ఞప్తులు ఏ తల్లిదండ్రులో, శ్రేయోభిలాషులో చేశారనుకోకండి. ఇలా బతిమాలుకుంటున్నది చైనా(China) దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌(Xi Jinping). ఎందుకోకానీ ఆయనకు చిత్రమైన భయం పట్టుకుంది. దేశంలో జననాల రేటు బాగా తగ్గిపోతుండటంతో అభివృద్ధికి దూరంగా వెళ్లిపోతామేమోనని భయపడుతున్నారు.

అమ్మాయిలు.. ప్లీజ్‌ పెళ్లి చేసుకోండి. చక్కగా పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కనండి.. యువతులకు ఇలాంటి విన్నపాలు, విజ్ఞప్తులు ఏ తల్లిదండ్రులో, శ్రేయోభిలాషులో చేశారనుకోకండి. ఇలా బతిమాలుకుంటున్నది చైనా(China) దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌(Xi Jinping). ఎందుకోకానీ ఆయనకు చిత్రమైన భయం పట్టుకుంది. దేశంలో జననాల రేటు బాగా తగ్గిపోతుండటంతో అభివృద్ధికి దూరంగా వెళ్లిపోతామేమోనని భయపడుతున్నారు. అందుకే దేశంలోని యువతులంతా పెళ్లి చేసుకోవాలని బతిమాలుతున్నారు. లేటెస్ట్‌గా జరిగిన ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్(All China Women Federation) సమావేశంలో జిన్‌పింగ్‌ యువతులు పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు విపరీతమైన జనాభాతో అల్లాడిపోయిన చైనా జనాభాను కంట్రోల్‌ చేయడానికి నానా పాట్లు పడింది. ఇప్పుడేమో శిశు జననాల రేటు(Birth Rate) తగ్గిపోవడంతో ఆందోళన చెందుతోంది. మరోవైపు చైనా అమ్మాయిలు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. కెరీర్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జీ జిన్‌పింగ్‌ జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్న జిన్‌పింగ్‌ దేశంలో కుటుంబ వ్యవస్థను కాపాడటంతో మహిళలదే కీలకపాత్ర అని అన్నారు. దేశంలో వివాహాలు, సంతాన సాఫల్యత అనే నూతన సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నిరుడు చైనా సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోయి 1.09కి చేరుకుంది. దేశంలో సంతానం లేని దంపతుల సంఖ్య రెండింతలు పెరిగింది. పుట్టే పిల్లలను పెంచడం కష్టంగా మారిందక్కడ! పైగా లింగ వివక్ష(Gender Discrimination) కూడా ఎక్కువగా ఉంది. అందుకే యువత వైవాహిక జీవితం పట్ల విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ నేపధ్యంలో శిశు జననాల రేటు భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా అధ్యక్షుడు దేశంలోని యువత పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే చైనాలో వృద్ధుల జనాభా ఎక్కువయ్యింది. ఇలాగే ఉంటే భవిష్యత్తులో చైనా వృద్ధాప్య దేశంగా మారడం ఖాయం. ఇంకోవైపు ఆ దేశంలో కార్మికుల(Workers) సంఖ్య బాగా తగ్గింది.

Updated On 7 Nov 2023 2:25 AM GMT
Ehatv

Ehatv

Next Story