అటు భార్యగా.. ఇటు భర్తగా.. ఇద్దరు పిల్లలకు తల్లి-తండ్రి

చైనాలోని ఓ వ్యక్తికి గర్భం, పురుషాంగం ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వ్యక్తి వ్యవహారం చైనా అంతటా చర్చకు దారితీసింది. రెండు పునరుత్పత్తి వ్యవస్థలను కలిగి ఉన్న అరుదైన వ్యక్తి జీవిత ప్రస్థానం ఆసక్తి కలిగించే అంశంగా మారింది. ఓ వ్యక్తికి భార్యగా లియు అనే మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత లియుకు మగలక్షణాలు వచ్చాయి. గడ్డం, మీసాలతో పాటు పురుషుల అవయవాలు పెరగడంతో భర్త ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత లియు ఓ మహిళను పెళ్లాడి ఆమెకు మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు కారణమయ్యాడు/కారణమైంది.

బిషన్ కౌంటీలోని ఒక గ్రామంలో పెరిగిన ఈ మహిళకు చిన్నప్పటి నుండే అసాధారణమైన పరిస్థితులు నెలకొన్నాయి . మగవారిలా క్రాఫ్‌ను చేసుకునేందకు ఇష్టపడింది, మగ దుస్తులను ధరించింది. స్కూల్‌లో బాయ్స్‌ టాయిలెట్స్‌కు వెళ్లేది. లియు జీవితం 18 ఏళ్ళ వయసులో టాంగ్ అనే వ్యక్తిని పెళ్లాడడంతో ఆమె జీవితం నాటకీయ మలుపు తిరిగింది. వారికి ఒక సంవత్సరంలోపు ఒక కుమారుడు జన్మించాడు. అయితే, లియు శరీరం త్వరలో మార్పులకు గురైంది. ఆండ్రోజెనిక్ హార్మోన్ల ఆకస్మిక పెరుగుదల గడ్డం పెరగడం, రొమ్ము పరిమాణం తగ్గడం, పురుష పునరుత్పత్తి అవయవాల అభివృద్ధికి దారితీసింది. దీంతో భర్త ఆమెకు ఆమెకు విడాకులు ఇచ్చాడు.

ఆమె విడాకుల తరువాత, లియు తన కొడుకును అతని తండ్రితో విడిచిపెట్టి మరో ప్రాంతానికి వెళ్లిపోయింది. అక్కడ ఆమెకు షూ ఫ్యాక్టరీలో పని దొరికింది. మగవాడిగా జీవించడం ప్రారంభించింది. ఈ సమయంలో లియు జౌ అనే మహిళా సహోద్యోగిని కలిసింది. జౌ అనే మహిళ లియు పట్ల ఆకర్షితురాలైంది. ప్రారంభంలో లియు తన ప్రత్యేకమైన శారీరక స్థితి కారణంగా జౌ ప్రేమను అంగీకరించేందుకు వెనుకాడింది. అయినప్పటికీ జౌ వదిలిపెట్టలేదు, లియు ప్రేమను పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. లియు పరిస్థితి తెలిసినా జౌ ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. అయినప్పటికీ లియు యొక్క ID కార్డ్ ఇప్పటికీ ఆమెను స్త్రీగా పేర్కొనడంతో చట్టపరమైన అడ్డంకిని ఎదుర్కొంది. చైనాలో స్వలింగ వివాహం గుర్తించబడనందున, ఈ జంట కలయిక చట్టబద్ధంగా అనుమతించబడలేదు.

ఆమె సహాయం కోసం తన మాజీ భర్త టాంగ్‌ను ఆశ్రయించింది. జౌను పెళ్లి చేసుకునేందకు తన మాజీ భర్త టాంగ్‌ను ఒప్పించింది. ముగ్గురు కలిసి ఉండేందుకు అంగీకారం చేసుకున్నారు. తన మాజీ భర్తతో జన్మనిచ్చిన కుమారుడి పెంపకానికి తోడ్పడేందుకు లియు అంగీకరించాడు (అంగీకరించింది). ఈ అసాధారణ ప్రణాళికకు టాంగ్ అంగీకరించాడు. ఫలితంగా, టాంగ్ మరియు జౌ అధికారికంగా వివాహం చేసుకున్నారు. లియు, జౌ జంటగా కలిసి జీవించడం కొనసాగించారు. చాలా సంవత్సరాల తర్వాత జౌ గర్భవతి అయింది. ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. లియుకు ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారు.. ఒకరు ఆమెను "అమ్మ" అని ప్రేమగా పిలుచుకుంటారు.. మరొకరు ఆమెను "నాన్న" అని పిలుస్తారు.

Updated On 6 Jan 2025 11:56 AM GMT
ehatv

ehatv

Next Story